ఆ మాటలు ఎంతగానో బాధించాయి : యాంకర్ ప్రదీప్

praveen

బుల్లి తెరపై తన అద్భుతమైన యాంకరింగ్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుని హీరోల రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు యాంకర్ ప్రదీప్. తనదైన స్టైల్ యాంకరింగ్ తో ఎలాంటి వల్గారిటీ లేకుండా... ఫ్యామిలీ ప్రేక్షకులు అందరూ మెచ్చేలా ప్రదీప్ తన వాక్చాతూర్యంతో ఎంతో మంది మనసులు దోచుకున్నాడు. బుల్లితపై పలు కార్యక్రమాల్లో తన యాంకరింగ్ తో అదర గొడుతూనే...  మరోవైపు సినిమా ఈవెంట్ లతో కూడా హోరెత్తించే వాడు. అయితే మొన్నటి వరకు బుల్లి తెర పై తనదైన స్టైల్ యాంకరింగ్ తో అదరగొట్టిన ప్రదీప్... అప్పుడప్పుడు సినిమాల్లో పలు చిన్న చిన్న పాత్రల్లో  కూడా నటించారు. ఇక ఇప్పుడు యాంకర్ ప్రదీప్ కాస్త ఏకంగా హీరో ప్రదీప్ మారిపోయాడు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో ఇంకొన్ని రోజుల్లో తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోగా పరిచయం కానున్నాడు యాంకర్ ప్రదీప్. 

 


 దీంతో ప్రదీప్ అభిమానులు అందరూ ఎంతో సంబరపడిపోతున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఒక పాట ఇప్పుడు సోషల్ మీడియాను ట్రేండింగ్  గా మారిపోయింది. ఈ పాటను బట్టి చూస్తే ఈ సినిమాలో  ప్రదీప్ పల్లెటూరి అబ్బాయి గా కనిపించబోతున్నాడు అని అర్థమవుతుంది. తాజాగా విడుదలైన నీలి నీలి ఆకాశం అంటూ మొదలయ్యే ఈ సాంగ్ లో ప్రదీప్ గడ్డం వేసుకొని... దోతి కట్టుకొని పల్లెటూరి అబ్బాయి పాత్రలో ఒదిగిపోయాడు. ప్రస్తుతం ఇది ఎంతో మంది నెటిజన్లను  ఆకర్షిస్తూ దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే తాజాగా అనిషిత్ అనే  యువ డైరెక్టర్ ప్రదీప్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 

 

 గతంలో ప్రదీప్ అమ్మాయిని టీస్  చేసిన కేసులో రెండు రోజులు జైల్లో ఉండొచ్చాడని  అలా  జైల్లో ఉండి వచ్చిన వ్యక్తికి ఫిలిం చాంబార్ నిబంధనల ప్రకారం హీరోగా నటించేందుకు అనర్హుడు అంటూ ఆరోపణలు చేశాడు యువ డైరెక్టర్ అనిషీత్. కాగా ఈ  ఆరోపణలు  సంచలనంగా మారాయి. అయితే తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించిన ప్రదీప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనపై పోలీసు కేసులు ఉన్నాయని తాను జైలుకు వచ్చాను అంటూ ఆరోపణలు చేస్తున్న వ్యక్తి ని చూస్తుంటే తనకు ఎంతగానో జాలి వేస్తుంది అంటూ యాంకర్ ప్రదీప్ తెలిపాడు, కేవలం అటెన్షన్ క్రియేట్ చేయడానికి మాత్రమే ఆయన నాపై ఆరోపణలు చేసి ఉండవచ్చు అంటూ ప్రదీప్ వ్యాఖ్యానించాడు.కానీ ఆ వ్యక్తి చేసిన మాటలతో మాత్రం తనతో పాటు తన కుటుంబసభ్యులు కూడా బాధ పడ్డారు అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: