దూకుడు తగ్గించిన దేవరకొండ విజయ్.. కారణం ఏంటో..!
రౌడీ హీరో విజయ్ దేవరకొండలో దూకుడు తగ్గిందా.. డియర్ కామ్రేడ్ ఫ్లాప్ అవడంతో డీలా పడ్డ విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో వస్తున్నాడు. ఈ ప్రేమికుల రోజున రిలీజ్ అవుతున్న ఈ సినిమా నుండి వచ్చిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. క్రాంతి మాధవ్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో కె.ఎస్ రామారావు నిర్మించారు. గోపిసుందర్ మ్యూజిక్ అందిచిన ఈ సినిమాలో ఐశ్వర్యా రాజేష్, రాశి ఖన్నా, కేథరిన్ త్రెసా, ఇజాబెల్లా హీరోయిన్స్ గా నటించారు.
ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ స్పీచ్ తన ఫ్యాన్స్ కే కాదు పరిశ్రమ వర్గాలను ఆలోచనలో పడేశాయి. ఎప్పుడు జోష్ ఫుల్ గా మాట్లాడే విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో మాత్రం చాలా కూల్ గా నెమ్మదిగా మాట్లాడినట్టు అనిపించింది. అంతేకాదు తనలో మార్పు వచ్చిందని.. ఇక మీదట లవ్ స్టోరీస్ చేయనని అన్నాడు మన రౌడీ హీరో. విజయ్ దేవరకొండ సినిమా అంటే లవ్ స్టోరీ దానికి తగినట్టుగానే రొమాన్స్ ఉంటాయి.
అయితే ఇక మీదట తను ప్రేమకథలను పక్కన పెట్టి కమర్షియల్ సినిమాలు చేయాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ చేసే సినిమా కచ్చితంగా లవ్ స్టోరీ మాత్రం కాదని తెలుస్తుంది. ముఖ్యంగా ఈ లిప్ లాక్, హాట్ సీన్స్ వల్ల విజయ్ కు ఉన్న ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని ఆలోచించి ఉంటాడు. ప్రస్తుతం పూరి డైరక్షన్ లో సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ ఆ సినిమాలో ఫైటర్ గా కనిపించనున్నాడని తెలుస్తుంది. అయితే విజయ్ లో ఈ మార్పుకి పూరి జగన్నాథ్ కారణమని అంటున్నారు.