మహేష్ కోసం స్టార్ హీరో కూతురు వెయిటింగ్‌..?

Suma Kallamadi

సూపర్ స్టార్ మహేష్ బాబు.. టాలీవుడ్‌లో క్లీన్ ఇమేజ్ ఉన్న మంచి నటుడు. ఆయనతో సినిమా చేసిన వాళ్లు మళ్లీ మళ్లీ ఆయనతోనే చేయాలని ఉత్సాహం చూపిస్తారంటే మహేష్ వ్యక్తిత్వం ఎలాంటిదో ఓ అంచనాకు వచ్చేయొచ్చు. ఇక ఆయనతో పనిచేసిన దర్శకులు, హీరోయిన్స్‌ అయితే ఆయనకు మిస్టర్ పర్ఫెక్ట్‌ సర్టిఫికేట్ ఇచ్చేసి.. మళ్లీ ఆయన కాల్ కోసం వెయిటింగ్‌లో ఉంటారు. ఇండస్ట్రీలో ప్రతి ఒక్క టెక్నీషియన్ ఆయనతో పనిచేయాలని ఉబలాట పడుతూ వుంటారు.

 

ఇపుడు అదే కోవలోకి చేరింది.. సౌంద‌ర్యా ర‌జ‌నీకాంత్. అవును ఈ సూపర్ స్టార్ తో పనిచేయాలనుకుంటుంది ఆ సూపర్ స్టార్ కూతురు. దీనికి మన మహేష్ బాబు భార్య నమ్రత మీడియంగా పనిచేయబోతోంది. నమ్రతకు, సౌందర్యకు మంచి స్నేహం వుంది. ఇపుడు ఆ కారణంగానే... ఇది వర్కవుట్ అవబోతోంది. సౌందర్య రజనీకాంత్ గురించి తెలియనివారుండరు.

 

సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురుగా ఇండస్ట్రీకి పరిచయం అయిన సౌందర్య రజనీ కాంత్, కొచ్చాడయాన్ సినిమాతో డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకుంది. గతంలో పలు చిత్రాలకు గ్రాఫిక్స్ డిజైనర్ గా పనిచేసిన సౌందర్య, కొచ్చాడయాన్తో నిర్మాత, దర్శకురాలిగానూ మారింది. అయితే ఈ సినిమా నిరాశపరచటంతో మెగాఫోన్ను పక్కనపెట్టి బిజినెస్ పనులు చూస్తూ చాలాకాలం గడిపింది. తాజాగా మరోసారి తన డైరెక్షన్ టాలెంట్ను ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అవుతోంది ఈ స్టార్ వారసురాలు.

 

సూపర్ స్టార్ మహేష్ బాబుకి తన భార్య నమ్రతకి మధ్య ఎలాంటి బంధం ఉంటుందో అందరికి తెలిసినదే. ఆమె సలహాలు, సూచనలు తూ.చ పాటిస్తాడని అందరు అంటుంటారు. సౌందర్య విషయంలో కూడా ఆమె నిర్ణయం ఉంటుందనేది టాలీవుడ్ టాక్. ఈమె తొలినాళ్లలో మోడల్ గా వర్క్ చేస్తూనే మరొకవైపు జబ్ ప్యార్ కిసీసే హోతాహై (1998), మేరే దో అన్‌మోల్ రతన్ (1998), ఎల్వోసీ కార్గిల్(2003) వంటి హిందీ సినిమాలతో పాటు తెలుగులో వంశీ, అంజి, టక్కరిదొంగ సినిమాల్లో నటించి మెప్పించింది. ఇలా... తెలుగునాట నటించి, మహేష్ బాబుని ప్రేమ వివాహం చేసుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: