జాను ఓవర్సీస్ బయ్యర్లను భయపెడుతుందా?
అయితే ఆదివారం వారాంతపు కలెక్షన్లు కాస్త మెరుగుపడిన బయ్యర్లకి మాత్రం నష్టాలు తప్పేలా లేవు అని సమాచారం. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే జాను లాంటి క్లాస్ సినిమాలకి ఆదరణ ఎక్కువే అని చెప్పాలి. అంతేకాకుండా సమంత చిత్రాలకు అక్కడ డిమాండ్ కూడా బాగానే ఉంది. అలాంటిది సమంత నటించిన ఈ చిత్రం యూఎస్ వద్ద అతి తక్కువ వసూళ్లు రాబడుతూ డిజాస్టర్ దిశగా జానూ చిత్రం ప్రయాణిస్తుంది. 96 లాంటి హిట్ చిత్రానికి రీమేక్ అవ్వడం ఒక నెగటివ్ అని చెప్పాలి. సినిమా లో ఉన్నటువంటి ఎమోషన్ మిస్ అవ్వకూడదనే ఉద్దేశ్యం తో దర్శకుడు తమిళ్ లో తెరకెక్కించినట్లే తెలుగులో తెరకెక్కించడం, ఇక ఈ చిత్రం డిజిటల్ మీడియా లో తెలుగు ప్రేక్షకులకి అందుబాటుతో ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లే అవకాశం లేకుండా ఉంది. దాంతో సినిమా కి పాజిటివ్ టాక్ వచ్చిన కలెక్షన్లు రాబట్టలేకపోవడం బయ్యర్ల దురదృష్టమనే చెప్పాలి. కానీ ఈ చిత్రంలో దర్శకుడు ఏమాత్రం ఏ ఒక్క సీన్ ని మార్చినా కూడా సినిమా అస్సలు బావుండదని చూసిన ప్రతి ప్రేక్షకుడికి ఖచ్చితంగా తెలుస్తది. అలాగే తమిళ్లో చేసింది విజయ్‌సేతుపతి, త్రిష అయితే తెలుగులో శర్వా, సమంత కాబట్టి ఒకసారి చూడటానికి వెళ్ళొచ్చు. ఎందుకంటే సమంత నటనకి త్రిషకి చాలా తేడా ఉంటుంది. ఇందులో శర్వాను మించే యాక్షన్ సమంత చేసి ప్రేక్షకులను ఆకట్టుకుందనే చెప్పాలి.