కేజిఎఫ్ 2 లో ప్రముఖ తెలుగు నటుడు.. ఎవరో తెలుసా..?

praveen

కే జి ఎఫ్... చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో తెలిసిన విషయమే. ఇండస్ట్రీ తో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీలలో సంచలన విజయాన్ని నమోదు చేసి భారీ వసూళ్లు రాబట్టినది ఈ  సినిమా. తమిళ నటుడు యష్  ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మైనింగ్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కింది. సినిమా తెలుగు తమిళ కన్నడ మలయాళ ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని భాషల ప్రేక్షకులను ఎంతగానో అలరించింది అని చెప్పాలి. ఇక ఈ సినిమా అటు హీరో యష్ సహా దర్శకుడు ప్రశాంత్ నీల్ కు  కూడా ఎంతగానో ఇమేజ్ ను సంపాదించి పెట్టింది. అయితే కే జి ఎఫ్ సినిమా కొన్ని రోజుల పాటు అన్ని ఇండస్ట్రీల ప్రేక్షకులను ఒక ఊపు ఊపేసింది అని చెప్పాలి. 

 


 అయితే కేజిఎఫ్ సంచలన విజయాన్ని నమోదు చేయడంతో... కేజిఎఫ్ కి సీక్వెల్ ని కూడా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కే జి ఎఫ్ చూసి ఎక్సైటింగ్ గా ఫీల్  అయిన ప్రేక్షకులందరూ కే జి ఎఫ్ 2 ఎప్పుడు రాబోతుందని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇక కే జి ఎఫ్ టు లో భారీ తారాగణం కూడా ఉండడంతో ఈ సీక్వెల్ పై మరింత అంచనాలు పెరిగిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. అయితే కే జి ఎఫ్ 2 సినిమాలో ప్రధాన విలన్ గా  బాలీవుడ్ స్టార్ హీరో అయినా సంజయ్ దత్ నటిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాపై మరింత హైప్ పెరిగిపోయింది. కాగా ప్రస్తుతం కేజిఎఫ్ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. 

 


 యష్ ప్రధాన పాత్రలో  ప్రశాంతం దర్శకత్వంలో తెరకెక్కుతున్న కే జి ఎఫ్ టు సినిమాలో  తెలుగు నటుడికి చోటుదక్కినట్లు  తెలుస్తోంది. తెలుగులో ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి విలక్షణమైన నటనకు కేరాఫ్ అడ్రస్ గా మరి... గుర్తింపు తెచ్చుకున్న రావు రమేష్ కి కే జి ఎఫ్ 2 సినిమాలో  నటించేందుకు అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. తెలుగు నటుడు రావు రమేష్ ను  తీసుకున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.  కే జి ఎఫ్ 2 కి స్వాగతం రావు రమేష్ సార్.. కే జి ఎఫ్ 2 సినిమాలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది అనేది ప్రేక్షకుల ఊహకే వదిలేస్తున్నాను. కే జి ఎఫ్ 2 లో భాగం అయినందుకు ధన్యవాదాలు సార్ అంటూ కేజిఎఫ్ 2 దర్శకుడు ప్రశాంత్  రావు రమేష్ తో దిగిన ఫోటో ని పోస్ట్ చేశారు.ఇప్పుడిది  సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
Welcome on board {{RelevantDataTitle}}