‘వి’ మూవీతో ఈ ఇద్దరు హిట్ కొడతారా?
ఈ మద్య మల్టీస్టారర్ మూవీస్ బాగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాని, సుధీర్ బాబు నటించిన వి సినిమా మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. గత కొంత కాలంగా టాలీవుడ్ లో మల్టీ స్టారర్ మూవీస్ కి మంచి ఆదరణ లభిస్తుంది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో ఆర్ఆర్ఆర్ మూవీ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక వీ మూవీలో అందరినీ కాపాడే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మరో హీరో సుధీర్‌బాబు నటిస్తున్నారు. ఇటీవల వీరిద్దరి పాత్రలకు సంబంధించిన లుక్స్‌ను విడుదల చేసిన చిత్రయూనిట్ ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఉన్న పోస్టర్‌ను విడుదల చేసింది.
నాని, సుధీర్ బాబు ప్రధానపాత్రల్లో దర్శకత్వంలో వస్తున్న మూవీ 'వి'. ఇందులో నాని విలన్ ఛాయలున్న పాత్ర పోషిస్తుండడం విశేషం. 'వి' మూవీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. నానితో అష్టాచమ్మ, జెంటిల్మన్..సుధీర్ సమ్మోహనం వంటి విజయవంతమైన సినిమాలు తెరకెక్కించిన డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. హిట్ సినిమా ల నిర్మాత దిల్‌రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో శిరీష్, హర్షిత్ రెడ్డి ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 17న విడుదల చేస్తున్నారు. అలాగే సినిమాను ఉగాది సందర్భంగా మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈమూవీపై అటు సుధీర్ బాబు, నాని కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
'నాణేనికి రెండు వైపులు... బొమ్మ, బొరుసు... నేరం, న్యాయం' అంటూ సినిమా థీమ్ ను వెల్లడించే ప్రయత్నం చేశారు. 'వి' మూవీ మార్చి 25న రిలీజ్ కానుంది. నటీనటులు: నాని, సుధీర్‌బాబు, నివేదా థామస్, అదితిరావు హైదరి తదితరులు, సాంకేతిక వర్గం: మ్యూజిక్: అమిత్ త్రివేది, నేపధ్య సంగీతం: థమన్,సినిమాటోగ్రఫీ: పి.జి.విందా, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేశ్, నిర్మాతలు: రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి, రచన, దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి,