ఈ హీరోలకు రియల్ లైఫ్ హీరోయిన్లు ఎవరు..?

shami
టాలీవుడ్ లో ఇప్పుడు హీరోయిన్ల పెళ్లి గురించి అందరు మాట్లాడుకుంటున్నారు కానీ పెళ్లి కావాల్సిన హీరోల గురించి ఆలోచిస్తే పెద్ద లిస్టే తేలింది. సినిమాల్లో హీరోయిన్లను ఫ్లాట్ చేస్తున్న మన హీరోలు ఎవరెవరు వరుడు కాడానికి రెడీ గా ఉన్నారో చూద్దాం. ఈ వరుసలో టాప్ రేంజ్ లో ఉన్న హీరోల నుండి వస్తే మనం మాట్లాడుకోవాల్సిన ఆరడుగుల ఆజానుబావుడు ప్రభాస్ గురించి. యూత్ లో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ యంగ్ రెబల్ స్టార్ ఇప్పటివరకు బ్యాచిలర్ గానే ఉన్నాడు. శతృవులను చీల్చి చండాడే ఈ బాహుబలి పెళ్లెప్పుడు చేసుకుంటాడో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఫైనల్ గా 2015 లో ఈ రెబల్ స్టార్ ముక్కుకు తాడు పడ్తుందని అంచనా.. ఇక ఈ వరుసలో దగ్గుబాటి వారసుడు రానా కూడా ఉన్నాడు. త్రిషతో వస్తున్న గాసిప్లన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టేసిన ఈ హీరో పెళ్లి గురించి ఇంకా ఆలోచించలేదట. ఈ వరుసలో లవ్ బోయ్ ఇమేజ్ తో ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే సినిమా హిట్ లతో జోష్ మీదున్న నితిన్ కూడా వచ్చేస్తాడు. సినిమాల్లో హీరోయిన్ మనసులను కొల్లగొట్టి వారిని ప్రేమించి పెళ్లాడే ఈ యువ కథానయకుడు ఎవరిని పెళ్లి చేసుకుంటాడో అని ఫ్యాన్స్ వెయిటింగ్. ఈ వరుసలోనే తన కామెడీతో ఆడియెన్స్ ని కడుపుబ్బా నవ్వించే కథానాయకుడు అల్లరి నరేష్ కూడా ఉన్నాడు. బ్యాచిలర్ లైఫ్ కి బై బై చెప్పి పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు నరేష్ ఫ్యామిలీ వర్గాలు అనుకుంటున్నాయి. ఇక మంచు వారి రెండో హీరో మనోజ్ కూడా ఈ దారిలోనే ఉన్నాడు.. రాకింగ్ స్టార్ గా ఆడియెన్స్ ని అలరిస్తున్న మనోజ్ పెళ్లి కూడా ఎప్పుడవుతుందో అని మంచు అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఇదే వరుసలో చాక్లెట్ బోయ్.. ఎనర్జీ హీరో రాం కూడా ఉన్నాడు. యూత్ ఫుల్ మూవీస్ తో సూపర్ క్రేజ్ ఉన్న ఈ కుర్ర హీరో పాతిక సంవత్సారాల వయసున్నా ఇంకా చాలా యంగ్ ఏజ్ పిల్లాడిలా ఉంటాడు. ఈ స్టార్ కి కూడా పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అని ఆడియెన్స్ వెయిటింగ్. సో మొత్తానికి పెళ్లి కాని హీరోల షాది బ్యాండ్ బాజా త్వరలోనే మోగేస్తుందని వెళ్లడయ్యింది...చూద్దాం ఎవరు ఎవరిని పెళ్లాడతారో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: