అనుష్క పెళ్లాడే ఆ సౌత్ క్రికెటర్ ఎవరో తెలుసా... సీక్రెట్ రివీల్...!
అనుష్క.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎందుకంటే ఈ భామ అంతగా తన నటనతో ప్రేక్షకుల మనసులను దోచుకుంది. సౌత్ ఇండియన్ నెంబర్ వన్ హీరోయిన్గా చక్రం తిప్పింది. తనదైన అందం, అభినయంతో అభిమానులను మెస్మరైజ్ చేయడం అనుష్క స్పెషాలిటీ. ఏ పాత్ర చేసినా ఆ పాత్రలో ఒదిగిపోవడం ఈ బెంగళూరు భామ మరో స్పెషాలిటీ. ఇక అభిమానులు మాత్రం ఆమెను ముద్దుగా ‘స్వీటీ’ అని పిలుస్తుంటారు. ఇండస్ట్రీ పెద్దలకూ ఆమె స్వీటీనే. ఇక తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడూ బోర్ కొట్టని టాపిక్ అనుష్క పెళ్లి. ఈమె మ్యారేజ్ గురించి చాలా రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.
38 సంవత్సరాలున్న ఈ అమ్మడు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి 15సంవత్సరాలు పూర్తి కావొస్తోంది. రోజు రోజుకి రూమర్లు ఎక్కువైపోతుంటే అనుష్క పెళ్లిపై రోజుకో వార్త బయటికి వస్తుంటే అభిమానుల్లో కూడా కంగారు పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే మరో వార్త బయటకు వచ్చింది. అదేంటంటే.. ప్రస్తుతం అనుష్క ఓ క్రికెటర్‌తో డేటింగ్ చేస్తున్నారని, త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారు అనే వార్త సోషల్ మీడియాలో తిరుగుతోంది. అయితే అనుష్క పెళ్లి చేసుకోబోయే క్రికెటర్ ఎవరంటే.. నార్త్ ఇండియాకు చెందినవారని, ప్రస్తుతం సౌత్‌లో రంజీ మ్యాచ్ లు ఆడుతున్నారని టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తలను అనుష్క ఎంత వరకు నిజం చేస్తుందో? వేచి చూడాలి.
ఇదే నిజమైతే.. అటు అనుష్క ఫ్యాన్స్.. ఇటు ప్రేక్షకులు ఫుల్ ఖుషీ అవుతారు. కాగా, బాహుబలి తో దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన జేజమ్మ.. ప్రస్తుతం బరువు తగ్గి 'నిశ్శబ్దం' అనే సినిమా చేస్తోంది. అరుంధతి, బాహుబలి, రుద్రమదేవి, భాగమతి వంటి చిత్రాలతో మహిళా ప్రాధాన్య చిత్రాలకు అనుష్క కేరాఫ్ అడ్రెస్‌గా మారింది. వైవిధ్యమైన కథతో అనుష్క నుంచి రానున్న తాజా చిత్రం ఈ నిశ్శబ్ధం. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి గోపి సుందర్ దర్శకత్వం వహించగా.. ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.