అల్లు అర్జున్ కి ఇంత ఇగో ఉందా...?

Gullapally Venkatesh

మెగా ఫ్యామిలీ నుంచి ఎవరైనా హీరో వస్తే మనం ఏమనుకుంటాం...? మనం అనే కాదు ఎవరైనా ఏమనుకుంటారు...? వాళ్ళు అందరూ చిరంజీవి చెట్టు నీడ నుంచి వచ్చిన వాళ్ళే అని భావిస్తాం. చిరంజీవి మెగాస్టార్ అయ్యారు కాబట్టే వీళ్ళు సిని పరిశ్రమలోకి అడుగుపెట్టారని అనుకుంటాం. అది పవన్ కళ్యాణ్ అయినా, అల్లు అర్జున్ అయినా, రామ్ చరణ్ అయినా ఎవరైనా సరే అంతే. వాళ్లకు నేడు స్టార్ ఇమేజ్ ఉంది అంటే ప్రధాన కారణం చిరంజీవి అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిరంజీవి తమ్ముడు అవడమే పవన్ అద్రుష్టం అంటారు. 

 

అయితే నాకు ఇది నచ్చడం లేదని అంటున్నాడు అల్లు అర్జున్. తనకు తన తండ్రి సహకారం ఉందీ అంటే నమ్ముతాను గాని చిరంజీవి వలన తనకు స్టార్ ఇమేజ్ వచ్చింది అంటే నమ్మను అంటూ కామెంట్ చేస్తున్నాడట. అల్లు అర్జున్ హిట్స్ తో దూసుకుపోతున్నాడు. నా పేరు సూర్య సినిమా ఫ్లాప్ అయినా అల వైకుంఠపురం సినిమా మంచి విజయం సాధించింది. వసూళ్ళ పరంగా కూడా అల్లు అర్జున్ కి ఈ సినిమా మంచి హిట్ ఇచ్చింది. అంత వరకు బాగానే ఉంది గాని, ఇటీవల ఒకతను ఒక పార్టీలో అల్లు అర్జున్ వద్ద, చిరంజీవి గురించి ప్రస్తావించారట. 

 

తాను తన నటన వలన, తర్వాత తండ్రి వలన పైకి వచ్చానే గాని ఎవరి సహకారంతో కాదని స్పష్టం చేసాడట. తనకు అంటూ ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారని, వాళ్ళు తనకు ఆర్మీ అని వ్యాఖ్యానించాడట. వాళ్ళు కేవలం తనకు మాత్రమే అభిమానులు గాని ఎవరి అభిమానులో తనకు అండగా నిలబడలేదు అంటూ కొన్ని హాట్ కామెంట్స్ చేసాడట. దయచేసి తన గురించి తక్కువ చేసి మాట్లాడవద్దని, తన తండ్రి వలనే తాను ఈ స్థాయిలో నేడు ఉన్నాను అని స్పష్టంగా చెప్పాడట బన్నీ. దయచేసి ఇంకెప్పుడు కూడా ఈ విధంగా తనను తక్కువ చేసి మాట్లాడవద్దని అన్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: