శింబు మరో హీరోయిన్‌తో ఎఫైర్ స్టార్ట్ చేశాడా...!
ఆ తర్వాత ముదురు ముద్దుగుమ్మ త్రిష.. యంగ్ బ్యూటీ ఓవియో .. గాయని కం నటి ఆండ్రియాతోనూ శింబు ఎఫైర్లు నడిపించాడని కోలీవుడ్ మీడియాలో ప్రచారమైంది. ఇలా వరుస ఎఫైర్ల తర్వాత కెరీర్లో పడిపోయిన శింబు తర్వాత మళ్లీ హీరోగా కాస్త కుదుట పడ్డాడు. అయితే ఇంతలోనే మళ్లీ మరో హీరోయిన్‌తో అతడు ఎఫైర్ నడుపుతున్నాడన్న వార్తలు వస్తున్నాయి.
ఇటీవలే తండ్రి టి. రాజేందర్ త్వరలో శింబుకు పెళ్లి చేస్తానని ప్రకటించడం అభిమానుల్లో చర్చకు వచ్చింది. మరి శింబు కొత్త ఎఫైర్ నడుపుతోన్న ఆ హీరోయిన్ ఎవరో కాదు అన్నకొడి సినిమాతో కోలీవుడ్ కి పరిచయమైన సుభిక్ష తో ప్రేమలో ఉన్నాడని కోలీవుడ్ మీడియా హాట్ టాపిక్. ఈ ప్రచారం ఇప్పుడు బాగా వైరల్ అవ్వడంతో చివరకు సుభిక్ష కూడా రంగంలోకి దిగి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
శింబు అంటే తనకు చాలా గౌరవం ఉందని... ఆయన స్నేహానికి చాలా విలువ ఇస్తారని.. చెప్పింది.. తాము ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అని చెప్పింది. అయినా ఈ పుకార్లు మాత్రం ఆగడం లేదు. శింబు సుభిక్షనే పెళ్లాడతాడని వార్తలు జోరుగా వైరల్ అవుతున్నాయి. శింబు తండ్రి టి. రాజేందర్ సైతం సుభిక్ష తోనే శింబు పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారంటూ కూడా వార్తలు రాసేస్తున్నారు. మరి ఇవి పుకార్లుగానే మిగులుతాయా ? శింబు ఓ ఇంటి వాడు అవుతాడా ? అన్నది చూడాలి.