సినిమా సినిమాకు కొత్తదనం...!

Gullapally Venkatesh

ఈ రోజుల్లో సినిమా చూడాలి అంటే మాత్రం గతంలో మాదిరిగా స్టార్ హీరో ఇమేజ్ ఉంటే సరిపోదు. సినిమా సినిమాకు కొత్తదనం అనేది చాలా అవసరం. అలా ఉంటేనే సినిమాను ఆదరిస్తారు అభిమానులు. ఎంత స్టార్ ఇమేజ్ ఉన్నా సరే నటనలో వైవిధ్యం లేకపోతే మాత్రం చాలా వరకు కష్టమవుతుంది అనేది వాస్తవం. అందుకే ఈ మధ్య హీరోయిన్లు క్రియేటివ్ దర్శకులతో సినిమాలు చేయడానికి సిద్దమవుతున్నారు. ఈ మధ్య ఇది ఎక్కువగా ఉంది. అందుకే ఈ మధ్య సినిమా వసూళ్ళ విషయంలో కూడా దూసుకుపోతుంది. రొటీన్ రోత కథలతో సినిమా చేస్తే సినిమా ఆడటం అనేది కష్టం.

 

కాని జూనియర్ ఎన్టీఆర్ కి ఈ ఇబ్బంది లేదు అంటున్నారు అభిమానులు. ఇప్పటి వరకు తారక్ చేసిన ప్రతీ సినిమా కూడా అతనిలో కొత్త ధనం ఉంటుంది అనేది అతని సినిమాలు చూస్తే స్పష్టంగా అర్ధమవుతుంది. జైలవకుశ, నాన్నకు ప్రేమతో, అరవింద సమేత, టెంపర్, రాఖీ, అశోక్, ఆది, నరసింహ నాయుడు, జనతా గ్యారేజ్ ఇలా సినిమా సినిమాకు తనలో వైవిధ్యం చూపిస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నటన కోసం ఎంత వరకు అయినా వెళ్ళే స్వభావం ఉన్న నటుడు కావడంతో సినిమాలో విలక్షణ నటన చూపిస్తున్నాడు తారక్. 

 

ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో కొమరం భీమ్ గా కొత్తగా ట్రై చేస్తున్నాడు. వీరుడిగా మొదటిసారి నటిస్తున్నాడు తారక్. ఇలా దాదాపు అన్ని సినిమాల్లో కూడా తారక్ ఏదోక రూపంలో తనలో వైవిధ్యం చూపిస్తూ ఇతర హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. అందుకే దర్శకులు కూడా అతని కోసం భిన్నమైన కథలు రాసుకుంటూ ఇటు అభిమానులను కూడా అలరించే ప్రయత్నం చేస్తున్నారు అనేది స్పష్టంగా అర్ధమవుతుంది. భవిష్యత్తులో కూడా ఇలాంటి కథలతో సినిమాలు చెయ్యాలని, ఇప్పుడు తారక్ ఏ ప్రయోగం చేయడానికి అయినా సరే సిద్దంగా ఉంటున్నాడు కాబట్టి అతనితో ఏ ఇబ్బంది ఉండదు అంటున్నారు దర్శకులు కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: