క్షమించమని అడిగితే క్షమిస్తా... పంతం వీడని రాధారవి
తెలుగు లో కాస్టింగ్ కౌచ్... బాలీవుడ్ లో మీ టూ ఉద్యం నేపథ్యంలో ఎంతో మంది నటీమణులు తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి పెద్ద ఎత్తున గళం విప్పారు. ఈ నేపథ్యంలో సింగర్ చిన్మయి గతంలో తనపై ప్రముఖ రచయిత వైర ముత్తు లైంగిక వేధింపులకు పాల్పపడ్డారని ఆరోపించింది. అంతే కాదు తన సహ సింగర్ కూడా వైధింపులకు పాల్పపడ్డారని ఆరోపించింది. అయితే దీనిపై స్పందించిన డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోయేషన్ ఆమేపై తీవ్రంగా స్పందించింది. అంతే కాదు ప్రముఖ నటుడు రాధారవి సైతం ఆపై తీవ్ర ఆరోపణలు చేశారు. పదేళ్ల క్రితం జరిగితే ఇప్పడు స్పందించడం ఏంటీ అని ఆమెపై విరుచుకు పడ్డారు.
అంతే కాదు ఆమెను డబ్బింగ్ అసోసియేషన్ నుంచి తీసివేసినట్లు చెప్పారు. ఇటీవల ఆమె డబ్బింగ్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేసినా... ఆమెను తీరస్కరించిన విషయం తెలిసిందే. అంతే కాదు రాధారవి అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. ఇదిలా ఉంటే తనపై ఎన్నో ఆరోపణలు చేసిన గాయని చిన్మయి, క్షమాపణలు కోరితే క్షమిస్తానని, తిరిగి డబ్బింగ్ కళాకారుల సంఘంలో చేర్చుకునేందుకూ అభ్యంతరం లేదని సంఘం అధ్యక్షుడు రాధారవి వెల్లడించారు. కోలీవుడ్ డబ్బింగ్ కళాకారుల సంఘం ఎన్నికలు నిన్న చెన్నై, కోయంబేడులోని ఏకేఆర్ కల్యాణమండపంలో జరిగాయి.
తాను డబ్బింగ్ కళాకారుల సంఘానికి ఏకగ్రీవంగా ఎన్నికైన నేపథ్యంలో తాను చిన్మయి క్షమాపణలు కోరితే క్షమిస్తానని అన్నారు. అంతే కాదు డబ్బింగ్ కళాకారుల సంఘం ఆహ్వానిస్తామని కూడా అన్నారు. తాజాగా డబ్బింగ్ కళాకారుల సంఘంలో తిరిగి చేర్చుకుంటానని రాధారవి వ్యాఖ్యానించిన నేపథ్యంలో చిన్మయి ఘాటుగా స్పందించారు. తాను ఎలాంటి తప్పులు చేయలేదని.. తప్పుడు ఆరోపణలు కూడా చేయలేదని అలాంటపుడు తాను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమాపణలు చెప్పబోనని స్పష్టం చేశారు. తాను ఎవరినీ క్షమాపణలు కోరే ప్రసక్తే లేదని... తన మాటలకు ఇప్పుడు కట్టుబడి ఉన్నానని అన్నారు.