త్రివిక్రమ్ కథలు అన్నీ కాపీనా...?

Gullapally Venkatesh

మాటల మాంత్రికుడు సినిమా అనగానే అభిమానుల్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన కు అంటూ ప్రత్యేకంగా అభిమానులు కూడా ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆయన రాసే మాటలకే అభిమానులు ఎక్కువ. దీనితో ఆయన సినిమా కు సాధారణంగా హైప్ వచ్చేస్తుంది. దీనితో ఆయన పారితోషకం కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఎందరో నిర్మాతలు ఆయన తో సినిమా చెయ్యడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక ఆయన కలానికి ఉన్న పదునికి థియేటర్ లో ఒక ఊపు కూడా వస్తుంది అనే విషయం సినిమా చూడగానే స్పష్టంగా అర్ధమవుతుంది. 

 

అంత వరకు బాగానే ఉంది గాని ఇక్కడే ఒక సమస్య వచ్చి పడింది అతనికి. ఎందుకంటే  త్రివిక్రమ్ ఈ మధ్య  చేసే సినిమాలు అన్నీ కాపీ అనే ఆరోపణలు వినపడుతున్నాయి. అతని సినిమాలు అన్నీ దాదాపుగా కాపీనే అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ తో ఆయన చేసిన అరవింద సమేతా సినిమా కాపీ అనే ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. ఆ తర్వాత ఆ వివాదాన్ని ఆయన సెటిల్ చేసుకున్నారు. మొండి కత్తి అనే కథ ను కాపీ చేసి ఈ విధంగా ఆయన సినిమా చేసారట. 

 

ఇక ఇప్పుడు అల వైకుంఠపురములో సినిమా మీద కూడా అవే ఆరోపణలు వస్తున్నాయి. ఆయన సినిమాలు అన్నీ ఇదే విధంగా కాపీ అవుతున్నాయని ఆయన అభిమానులే సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తున్నారు. త్రివిక్రమ్ కి అంటూ ఒక రేంజ్ ఉందని, ఆ రేంజ్ ని ఆయన నాశనం చేసుకోవద్దని, ఆయన సినిమాలు అంటే పడి చచ్చే వాళ్ళు ఉన్నారని, ఇలా కథలను కాపీ చేయడం ఏంటీ అంటున్నారు. అత్తారింటికి దారేది, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా కూడా కాపీ అనే ఆరోపణలు వచ్చాయి. ఇలా ఆయన చేసే ప్రతీ సినిమా కథ కూడా కాపీనే అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: