నాకూ రాహుల్ కు మధ్య అలాంటిదేమీ లేదు... పునర్నవి సంచలన వ్యాఖ్యలు...?

Reddy P Rajasekhar

బిగ్ బాస్ సీజన్ 3 తో రాహుల్, పునర్నవి సంపాదించుకున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. రాహుల్, పునర్నవి కెమిస్ట్రీ వలనే బిగ్ బాస్ సీజన్ 3 సక్సెస్ అయిందని కొంతమంది నమ్మకం. రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ టైటిల్ విన్ కావడానికి పునర్నవి ఒక రకంగా కారణమని వార్తలు వినిపించాయి. బిగ్ బాస్ సీజన్ 3 ముగిసిన తరువాత పునర్నవి, రాహుల్ సిప్లిగంజ్ తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని చెప్పినప్పటికీ చాలామంది వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారని ఇప్పటికీ నమ్ముతున్నారు. 
 
తాజాగా పునర్నవి ప్రధాన పాత్రలో నటించిన ఒక చిన్న విరామం అనే సినిమా విడుదలయింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. ఈ సినిమాను థియేటర్ లో చూసిన రాహుల్ తనకు ఒక మాట చెప్పాడని పునర్నవి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. పునర్నవి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బిగ్ బాస్ షో తరువాత ఒక చిన్న విరామం కథ నచ్చటంతో ఆ సినిమా ఓకె చేశానని అన్నారు. 
 
రాహుల్ తాను కేవలం బెస్ట్ ఫ్రెండ్స్ అని రాహుల్ కు తనకూ మధ్య లవ్ లేదని చెప్పారు. రాహుల్ ఒక చిన్న విరామం సినిమా చూశాడని ఈ సినిమాలో నా చెల్లి పాత్రలో నటించిన అమ్మాయి చాలా బాగుందని చెప్పాడని అన్నారు. ఇప్పటికైతే ప్రేమ, పెళ్లి ఆలోచనలు లేవని బిగ్ బాస్ షో తన గురించి రాహుల్ గురించి పెద్దగా చూపించేసింది తప్పితే మా ఇద్దరి మధ్య అలాంటిదేమీ లేదని పునర్నవి అన్నారు. 
 
తనను, రాహుల్ ను కలిసి టీవీ షోలు చేయాలని అడుగుతున్నారని టీవీ షోలపై తనకు పెద్దగా ఆసక్తి లేదని పునర్నవి చెప్పారు. తాను కేవలం సినిమాల్లో నటించటానికి మాత్రమే వచ్చానని టీవీ షోలలో నటించనని అన్నారు. తనకూ రాహుల్ కు మధ్య ఉన్న రిలేషన్ ను ప్రొఫెషనల్ గానే ఉంచాలనుకున్నామని అంతకు మించి మా ఇద్దరి మధ్య ఏమీ లేదని పునర్నవి చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: