నాగార్జున అంతులేని ఆవేద‌న తీరుతుందా... ఈ క‌ష్టం గ‌ట్టెక్కుతాడా...!

VUYYURU SUBHASH

టాలీవుడ్ న‌వ మన్మ‌ధుడు అక్కినేని నాగార్జున వారసులుగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు అక్కినేని నాగచైతన్య... అక్కినేని అఖిల్. జోష్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నాగ చైతన్య మరి స్టార్ హీరో అనిపించకపోయినా తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అలాగే ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ గా ఉన్న స‌మంత‌ను ప్రేమ వివాహం చేసుకుని టాలీవుడ్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యాడు. నాగచైతన్య తనకంటూ ఓ బెంచ్ మార్క్ సెట్ చేసుకొని హీరోగా దూసుకు పెడుతున్నాడు. ఇక నాగార్జున రెండో వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన అక్కినేని అఖిల్ కెరీర్ ప్రారంభం నుంచి ఒడిదుడుకులను మారింది.

 

భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన తొలి సినిమా అఖిల్ ఘోర‌మైన డిజాస్ట‌ర్ అయ్యిది. రు. 55 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా అఖిల్ కెరీర్‌లో చీక‌టి మిగిల్చింది. ఆ త‌ర్వాత సొంత బ్యాన‌ర్లో మ‌ళ్లీ భారీ బ‌డ్జెట్ తో చేసిన హ‌లో కూడా ప్లాప్ అయ్యింది. తొలి రెండు సినిమాలు అఖిల్‌కు ఎంత మాత్రం క‌లిసి రాలేదు. ఇక మూడో సినిమాగా తొలిప్రేమ సినిమాతో వ‌రుణ్ తేజ్‌కు హిట్ ఇచ్చిన వెంకీ అట్లూరి న‌మ్ముకున్న అఖిల్ ప్రేమ‌క‌థ తీశాడు.

 

బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్ నిర్మించిన ఈ సినిమాలో అఖిల్ స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌. ఈ సినిమా కూడా ప్లాప్ అయ్యి అఖిల్‌కు ముచ్చ‌ట‌గా మూడో ప్లాప్ ఇచ్చింది. ఇలా కెరీర్‌లో చేసిన తొలి మూడు సినిమాలే ప్లాప్ అవ్వ‌డంతో అఖిల్ తీవ్రంగా డిజ‌ప్పాయింట్ అయిపోయాడంటున్నారు ఇండ‌స్ట్రీ జ‌నాలు. ఇక ఇప్పుడు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ డైరెక్ష‌న్‌లో చేసే సినిమా త‌ర్వాత సైరా డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డితో సినిమా చేసేందుకు ప్లాన్ సిద్ధ‌మ‌వుతోంద‌ట‌. ఇక నాగార్జున సైతం అఖిల్ భ‌విష్య‌త్తుపై స‌న్నిహితుల వ‌ద్ద మ‌నోవేద‌న చెందుతున్న‌ట్టు ఇండ‌స్ట్రీ జ‌నాలు చెప్పుకుంటున్నారు. మ‌రి అఖిల్ కెరీర్ ఎప్ప‌ట‌కి మారుతుందో ?  అత‌డికి ఎప్ప‌ట‌కి హిట్ వస్తుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: