ఆ హీరోయిన్ కెరీర్ ఖేల్ ఖతమే... !
ఆ తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్‌తో తొలిప్రేమ సినిమాలో నటించింది. ఆ సినిమాతో మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత కూడా ఆమెకు ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా రాలేదు. దీంతో రాశీ కెరీర్ మూడు అడుగులు ముందుకు పడితే... నాలుగు అడుగులు వెనక్కు అన్న చందంగా ఉంటోంది. మధ్యలో వెంకీ మామ లాంటి సినిమాలతో పాటు సాయి ధరమ్ ప్రతిరోజు పండగే సినిమాలు వచ్చినా అవి కూడా రాశీ కెరీర్‌కు పెద్దగా యూజ్ అవ్వలేదు.
తాజాగా రిలీజ్ అయిన వరల్డ్ ఫేమస్ లవర్ లో రాశి మెయిన్ హీరోయిన్.. ఈ సినిమాలో అందాల ఆరబోతతో పాటు గ్లామర్ పరంగా కూడా ఆమెకు మంచి పేరే వచ్చింది. అయితే సినిమాలో ఐశ్వర్య రాజేష్ రోల్ డామినేట్ అవ్వడంతో రాశీకి పేరు రాలేదు. దీనిపై సోషల్ మీడియాలో కూడా కామెంట్లు పడ్డాయి.
దీంతో రాశీ చివరి ఆశలు కూడా అడియాసలు అయ్యాయి. ఇప్పటికే టాలీవుడ్లో దాదాపు అందరితో జోడీ కట్టడంతో ఆ హీరోలు కొత్త హీరోయిన్ల వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఈ లెక్కన చూస్తే రాశీ కెరీర్ దాదాపు ఎండింగ్ స్టేజ్‌కు చేరుకున్నట్టే అనుకోవాలి.