భారతీయుడు 2 సెట్ లో ఘోర ప్రమాదం......దర్శకుడు శంకర్ పరిస్థితి విషమం.....??
శంకర్ శరీరానికి బాగా గాయాలయ్యాయి, అలానే కాలు కూడా విరిగినట్లు చెప్తున్నారు. దానివలన చాలా వరకు రక్తం పోయిందని, అందువలన ఆయనను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్న ప్రత్యేక వైద్య సిబ్బంది, మరొక 24 గంటల వరకు ఆయనను అబీజర్వేషన్ లో ఉంచాలన్నారు, దానితో ఒక్కసారిగా కోలీవుడ్ సినిమా పరిశ్రమలో తీవ్ర ఆందోళన లో ఉంది. ఇక ఆయన అభిమానులు అయితే శంకర్ త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు కూడా చేస్తూ పలు సోషల్ మీడియా మధ్యమాల ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్నిలైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్‌సింగ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 1996లో ఏ.ఎం. రత్నం నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో దాదాపు అన్ని భాషల్లో తెలుగు, తమిళ, హిందీ సంచలనం సృష్టించింది. ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. దీనికి సీక్వెల్‌గా వస్తున్న `భారతీయుడు 2`
ఇప్పటికే చెన్నై, హైదరాబాద్, రాజస్థాన్‌లోని కీలక ప్రదేశాల్లో సీన్స్‌ని షూట్ చేశారు.