తల్లి కాబోతున్న మహేష్ బాబు బాబు 'వన్' మూవీ హీరోయిన్..?

praveen

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన వన్  నేనొక్కడినే సినిమా గుర్తుంది కదా.. ఆ సినిమాలో హీరోయిన్ కృతి సనన్ గుర్తుందా... అలాంటి అందాన్ని ఎలా మర్చిపోతామండి.. అంటారా... మహేష్ బాబు సరసన వన్ నేనొక్కడినే సినిమాలో తన అందాలతో ప్రేక్షకుల అందరినీ ఆకర్షించింది... నటనతో ఆకట్టుకుంది కృతి సనన్. ఈ సినిమా హిట్ అవ్వకపోయినప్పటికీ.. ఈ సినిమాలో కృతి సనన్ అందాలకు మాత్రం తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు అనే చెప్పాలి. అయితే మహేష్ బాబు నేనొక్కడినే సినిమాలో తనదైన నటన అందాలతో అదరగొట్టిన ఈ అమ్మడు  ఇప్పుడు తల్లి కాబోతుంది. అదేంటి ఆ హీరోయిన్ కి  పెళ్లి కాలేదు కదా తల్లి ఎలా అవుతుంది అని మీకు డౌట్ రావచ్చు... అయితే ఈ అమ్మడు తల్లి కాబోతుంది రియల్ లైఫ్లోనే కాదు రీల్ లైఫ్లో.

 

 

 ప్రస్తుతం ఈ భామ కడుపుతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ఈ ఫోటోలు ఎక్కడివి అంటారా... ఇప్పటివరకు పలు సినిమాల్లో తన హాట్ హాట్ అందాలతో అందరికీ చెమటలు పట్టించిన ఈ అమ్మడు ప్రస్తుతం మీమీ  పేరుతో ఓ సినిమా చేస్తోంది. లక్ష్మణ్ ఉఠేకర్  డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో.. మదర్ పాత్రలో  నటిస్తోంది కృతి సనన్. ఈ క్రమంలోనే  కృతి సనన్ కడుపుతో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. అయితే ఈ ఫోటోని చిత్ర బృందం కాకుండా షూటింగ్ స్పాట్ కి వెళ్ళిన ఓ అభిమాని పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ పాత్ర చేయడం కోసం ఈ అమ్మడు  దాదాపు 15 కిలోల బరువు పెరగిందట కృతి సనన్ . 

 

 

 ఇదిలా ఉంటే... ఈ అమ్మడు బాలీవుడ్ లో  ఎన్నో సినిమాల్లో నటించింది. ఇక టాలీవుడ్ లో కూడా... సూపర్ స్టార్ మహేష్ బాబు వన్  నేనొక్కడినే సినిమాలో నటించినప్పటికీ ఈ సినిమా అంతగా కలిసి రాలేదు. గ్లామర్ పరంగా కృతి సనన్ అందాలతో ప్రేక్షకులను మెప్పిచ్చినప్పటికీ.. సినిమా మాత్రం ఫ్లాప్ గా నిలిచింది. ఇక ఆ తర్వాత అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కిన దోచేయ్  సినిమాలో కూడా నటించింది ఈ అమ్మడు. ఇక ఈ సినిమా కూడా అంతగా కలిసి రాకపోవడంతో తెలుగు సినిమాలకు దూరమై పోయింది. బాలీవుడ్లో మాత్రం వరుస ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: