తెలుగునాట బెంగాలి నటుడికి ఎందుకంత క్రేజ్ ?

NAGARJUNA NAKKA

టాలీవుడ్ మేకర్స్ పక్క భాషల నుంచి హీరోయిన్లని ఎలా ఇంపోర్ట్ చేసుకుంటారో.. విలన్స్ ని కూడా అలాగే తీసుకొస్తారు. ఒక్క సినిమాతో సూపర్ అనిపించుకుంటే చాలు వరుస ఆఫర్స్ ఇస్తారు. ఇప్పుడు ఇలాగే ఓ బెంగాలీ ఆర్టిస్ట్ ని తెలుగు నాట పాపులర్ విలన్ గా మార్చేస్తున్నారు మన దర్శకనిర్మాతలు.


కొత్తదనం కోసం కొత్త హీరోయిన్లని ఎలా దింపుతున్నారో.. విలన్స్ ని కూడా అలాగే పట్టుకొస్తున్నారు దర్శకులు. ఈ దిగుమతుల నుంచే షియాజీ షిండే, రాహుల్ దేవ్, ముఖేష్ రిషి లాంటి వాళ్లు ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు బెంగాళీ ఆర్టిస్ట్ జిషూ సేన్ గుప్తా ఇలాగే వరుస అవకాశాలు అందుకుంటున్నాడు. అశ్వద్ధామ సినిమాలో సైకోగా నటించిన జిషు, అమ్మాయిలను భయపెట్టాడు. 

 

భీష్మ సినిమాలో సంప్రదాయ వంటలను నాశనం చేసే.. కార్పొరేటర్ గా నటించాడు జిషు. రసాయ ఎరువులతో వ్యవసాయాన్ని చీడపట్టిస్తూ విత్తనాలను కూడా కల్తి చేసే కుర్రాడి పాత్ర పోషించాడు. శుక్రవారం ఈ సినిమా జనాల ముందుకొస్తోంది. ఇక ఈ  సినిమా జోరు చూస్తుంటే.. త్వరలోనే జిషు టాలీవుడ్ లో స్టార్ విలన్ గా మారే అవకాశముందని చెప్పొచ్చు. 

 

మరోవైపు నితిన్ కూడా హిట్ కోసం తెగ ఆరాటపడుతున్నాడు. భీష్మ సినిమాపై చాలా హోప్స్ పెట్టేసుకున్నాడు. ఎలాగైనా హిట్ వస్తుందని ధీమాతో ఉన్నాడు. భీష్మ సినిమా తనకు ఊరట నిస్తుందని ఆశపడుతున్నాడు. పెళ్లికి ముందుకు వచ్చిన ఈ సినిమా తన పెళ్లికి మంచి కానుక ఇస్తుందనే హోప్స్ పెట్టుకున్నాడు. అటు రష్మిక కూడా భీష్మపై తెగ ఆశలు పెట్టేసుకుంది. మరోవైపు బెంగాలీ ఆర్టిస్ట్ జిషూ సేన్ గుప్త భీష్మ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. అశ్వద్ధామ సినిమాలో తన టాలెంట్ ఏంటో చూపించిన జిషూ భీష్మలో ఎలా మెప్పించాడో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: