తెలుగు సినిమాలనే కాదు తెలుగు పాటలను వదలనంటున్న తమిళీలు ..

Satvika

సాధారణంగా ఒక సినిమా హిట్ అయితే ఆ సినిమా రీమేక్ చేయడమో లేక ఆ సినిమాలోని పాటలను రీమేక్ చేస్తూ మరొక ఇండస్ట్రీ  చేస్తూ వస్తుంది. అలా వచ్చిన సినిమాలు చాలా వరకు హిట్ అవుతుండటం కూడా చూస్తున్నారు. ఇకపోతే ఇప్పుడు తమిళ్ లో తెలుగు సినిమాలకు మంచి ప్రత్యేకత ఉంటుంది. తెలుగు పాటలను తమిళ్ చిత్రాల్లో వాడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. 

 


తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తోన్న క్రేజీ మూవీ ‘మాస్టర్’. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి ఇటీవల ‘కుట్టి స్టోరీ’ పాట విడుదలైంది. హీరో స్వయంగా ఈ పాటను ఆలపించడంతో బాగా పాపులారిటీ వచ్చింది. విపరీతంగా ట్రెండ్ అయ్యింది. అయితే, ఈ పాట తెలుగు వర్షన్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆలపించనున్నట్టు సమాచారం.

 


ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో సినిమాలో ప్రత్యేకంగా పాడిన ఐ వాన ఫాలో ఫాలో అంటూ సాగిన పాటను దీంతో ‘కుట్టి స్టోరీ’ తెలుగు వర్షన్‌ను ఎన్టీఆర్‌తో పాడించాలని దర్శకుడు కనకరాజ్, సంగీత దర్శకుడు అనిరుధ్ భావించి ఆ విషయాన్ని విజయ్ వద్దకు తీసుకెళ్లారట. విజయ్‌కు కూడా ఈ నిర్ణయం బాగా నచ్చడంతో ఆయనే స్వయంగా ఎన్టీఆర్‌కు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశారట. ఎన్టీఆర్ కూడా పచ్చజెండా ఊపేశారని సమాచారం.

 


ఎన్టీఆర్ విజయాలకు మంచి స్నేహం ఉండటంతో ‘మాస్టర్’ తెలుగు రైట్స్ కూడా మహేష్ సొంతం చేసుకున్నట్టు సమాచారం. కాబట్టి, ‘మాస్టర్’ సినిమాలో ఎన్టీఆర్ పాట పాడటం వెనుక మహేష్ రాయబారం కూడా ఉండే ఉంటుందని ఇండస్ట్రీలో వినిపిస్తోన్న టాక్.. అయితే ఇద్దరు పాపులర్ హీరోలు కావడం విశేషం. ఇకపోతే విజయ్ సినిమాలో ఎన్టీఆర్ పాట అంటే అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: