నితిన్ ఖాతాలో మరో సూపర్ హిట్... ' భీష్మ ' బొమ్మ అదిరింది..!
నితిన్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు దర్శకుడు వెంకీ కుడుములు. భారీ ట్విస్ట్ లు, టర్న్ లు లేకుండా ఓ కూల్ కామెడీ ఎంటర్టైనర్తో ప్రేక్షకులను అలరించాడు. ఆ తరువాత దాదాపు ఏడాది పాటు స్క్రిప్ట్ మీద వర్క్ చేసిన వెంకీ, నితిన్‌ను దిల్ సినిమా టైంలో ఉన్నంత ఎనర్జీ తో చూపించాడు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా సినిమాలో కామెడీ బాగా వర్క్ అవుట్ అయ్యిందంటున్నారు ఆడియన్స్. కథ పెద్దగా లేకపోయినా కామెడీ మాత్రం సూపర్బ్ అంటున్నారు ఆడియన్స్. కామెడీతో పాటు నితిన్, రష్మికల కెమిస్ట్రీ కూడా సినిమాకు ప్లస్ అయ్యింది. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ తో సినిమా తరువాత మీడియం రేంజ్ హీరోలతో చేస్తుందా అన్న అనుమానాలకు చెక్ పెడుతూ నితిన్ సరసన జోడి కట్టింది రష్మిక. తనకు తెలుగులో తొలి అవకాశం ఇచ్చిన దర్శకుడు వెంకీ కోసం ఈ సినిమా చేసింది. తన క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో సినిమా సక్సెస్‌తో తన వంతు పాత్ర పోషించింది. ఓవరాల్‌గా నితిన్, రష్మికల భీష్మ సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది.