ఒక్క విషయంలో ఫెయిల్ అయిన నేచురల్ స్టార్..!
హీరోగా నాని హిట్ మీద హిట్స్ కొట్టాడు. మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. అంతా బాగానే ఉంది కానీ.. ఒక్క విషయంలో మాత్రం సక్సెస్ చూడలేకపోయాడు. నిర్మాతగా హిట్ కొట్టాలన్న కల హిట్ మూవీ తీరుస్తోందనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.
కథ నచ్చితే చాలు. ఆడుతుందా.. ఆడదా అని కమర్షియల్ గా ఆలోచించకుండా.. ప్రొడ్యూసర్ అయిపోతాడు నాని. వరుణ్ సందేశ్, సందీప్ కిషన్ నటించిన ఢీ ఫర్ దోపిడీ సినిమా చూసి నచ్చడంతో.. కో ప్రొడ్యూసర్ గా మారాడు. ఆ తర్వాత స్క్రిప్ట్ వర్క్ నచ్చి వాల్ పోస్టర్ సినిమా అనే బేనర్ లో సోలోగా నిర్మించాడు నాని.
కొత్త దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నాని నిర్మించిన అ! సినిమా డబ్బులు తీసుకురాకపోయినా.. అవార్డులు తీసుకొచ్చింది. బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్.. మేకప్ విభాగంగా జాతీయ అవార్డులు తీసుకొచ్చింది. అ! కమర్షియల్ గా ఫ్లాప్ అయిన తర్వాత నాని నిర్మాతగా మరో సాహసం చేయడనుకున్నారు. అయితే.. కథ నచ్చి మరోసారి నిర్మాతగా మారాడు నాని. విశ్వక్ సేన్ హీరోగా హిట్ మూవీ నిర్మించాడు.
మిస్సింగ్ కేసు చేధించే పోలీస్ ఆఫీసర్ గా విశ్వక్ కనిపిస్తాడు. హిట్ అంటే.. హుమిక్ సైడ్ ఇంటర్ వెర్షన్ టీమ్. న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్న నాని.. సైలేష్ కొలనుకు డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. మరి నాని ఈ సినిమాతో అయినా.. నిర్మాతగా సక్సెస్ చూస్తాడో లేదో తెలియాలంటే.. ఈ నెల 28 వరకు ఆగాల్సిందే. నేచురల్ స్టార్ గా నానికి మంచి పేరు ఉంది. అదే పేరును అలానే కొనసాగించాలని ఆ సహజ నుటుడు ఉవ్విళ్లూరుతున్నాడు. కొత్త పంథాలో ముందుకు సాగుతున్న నాని.. అటు నటుడిగా.. ఇటు నిర్మాతగా రాణించేలా పక్కా ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నాడు.