ఈ టైంలో మనోజ్ 60 కోట్ల రిస్క్.. స్టార్ హీరోలకు షాక్..!

shami

మంచు ఫ్యామిలీ నుండి వచ్చి రాకింగ్ స్టార్ గా ఎదిగిన మంచు మనోజ్ కెరియర్ లో పూర్తిగా వెనుకపడ్డాడు. మంచు ఫ్యామిలీ నుండి వచ్చిన ఫ్యాన్స్.. స్వతహాగా ఏర్పరచుకున్న ఫ్యాన్స్ ఇలా ఓ మంచి ఫ్యాన్స్ బేస్ ఏర్పరచుకున్న మనోజ్ పెళ్లి తర్వాత సినిమాల మీద పూర్తి కాన్సెంట్రేట్ చేయలేకపోయాడు. భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఇక మీదట పూర్తిస్థాయిలో సినిమాల మీద దృష్టి పెట్టనున్న మనోజ్ సొంత నిర్మాణంలో అహం బ్రహ్మాస్మి సినిమా ఎనౌన్స్ చేశాడు.

 

ఈ సినిమాను శ్రీకాంత్ ఎన్. రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను 60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారట మంచు మనోజ్. ఎమ్.ఎమ్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఈ సినిమా మనోజ్ స్వయంగా నిర్మిస్తున్నారు. మంచి టాలెంట్ ఉన్నా సరే కెరియర్ లో సరైన సక్సెస్ లు లేక సతమతమవుతున్న మంచు మనోజ్ లేటెస్ట్ గా అహం బ్రహ్మాస్మితో కసి మొత్తం చూపించనున్నాడు. అయితే తన మార్కెట్ అంతా కోల్పోయిన మంచు మనోజ్ ఈ టైమ్ లో ఈ రేంజ్ బడ్జెట్ సినిమా చేయడం పట్ల కూడా రిస్క్ అంటున్నారు.

        

రీసెంట్ గా మహా శివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తి స్వామివారి దర్శనానికి వెళ్లిన మంచు మోహన్ బాబు మనోజ్ సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు. అహం బ్రహాస్మి బడ్జెట్ రివీల్ చేసింది కూడా మోహన్ బాబే. అయితే ఈ సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు కాని సినిమా గురించి మనోజ్ ఎలాంటి సర్ ప్రైజ్ ఇస్తాడో చూడాలి. ఈ సినిమా కథ ఏంటి.. మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది అఫిషియల్ గా త్వరలో తెలుస్తుంది. ఈ సినిమా విజువల్ గా కూడా అడిరిపోతుందని తెలుస్తుంది.       
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: