హ్యాపీ సండే 23-FEB: ఈ వారమే తెలిసింది.. ఆ హీరోయిన్ కూడా హద్దులు దాటుతుందని...!

Durga Writes

అవును ఈ వారమే తెలిసింది.. ఆ నటి కూడా హద్దులు దాటేస్తుంది అని.. అసలు అనుకోని ఉండరు ఆ నటి ఇలా చేస్తుంది అని.. కానీ ఆ నటి కూడా అలాంటి పాత్రలో నటించి సాధారణ ఆర్టిస్ట్ లా మారిపోయింది.. హా ఆ నటి ఎవరో కాదు.. కుమారి 21ఎఫ్ లో బోల్డ్ గా నటించి మరి కొన్ని సినిమాలతో హిట్ కొట్టి... టాలీవుడ్ ని అంత అబ్బా అనిపించినా హెబ్బా పటేల్. 

 

 

ఏంటి హెబ్బా పటేల్ హద్దులు దాటిందా? అని మీకు సందేహం రావచ్చు.. కానీ నిజంగానే హెబ్బా పటేల్ హద్దులు దాటింది. ఎక్కడ దాటింది? ఎప్పు దాటింది అని అనుకుంటున్నారా? ఇంకెక్కడా ? ఈ వారం సూపర్ హిట్ అయినా భీష్మ చిత్రంలో ఈమె హద్దులు దాటి అబ్బా అనిపించింది. 

 

భీష్మ సినిమాలో ఈమె ఎంట్రీతోనే సినిమా ప్రారంభమవుతుంది.. అయితే హీరోయిన్ గా కాదు.. ఆస్తి కోసం ఓ ముసలోడును పెళ్లి చేసుకునే అమ్మాయిలా.. మళ్ళి హీరోకు ఆస్తి ఉంది అంటే హీరోతో పారిపోయే అమ్మాయిలా.. డబ్బు ఉంది అంటే మంత్రితో అమ్మాయిల ఈ సినిమాలో కనిపించింది.. 

 

 

సినిమా అవకాశాల కోసం హెబ్బా ఏమైనా చేస్తుంది అని ఈ వారమే అర్థం అయ్యింది. అసలు స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఉండాల్సిన హెబ్బా పటేల్ ఒక్క ప్లాప్ రాగానే ఇలా మారిపోయింది ఏంటో ? అని అభిమానులు సైతం ఆలోచిస్తున్నారట.. నిజానికి హెబ్బా పటేల్ సినిమాలో హీరోయిన్ గా బోల్డ్ సీన్స్ లో నటించింది కానీ ఇలా ఎప్పుడు నటించలేదు.. కానీ ఈ సినిమాలో ఇలా కూడా నటించి తన లెవెల్ ను తగ్గించేసుకుంది. అంతేకాదు అసలు ఈ సినిమాలో హెబ్బా పటేల్ ఉంది అనేది కూడా ఎవరికి తెలియదు.. అందరూ థియేటర్ వెళ్ళాక షాక్ అయ్యారు.. బాబోయ్ ఏంటి ఈమె కూడా ఉందా ఈ సినిమాలో అని..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: