హిందీ చంద్రముఖికి సీక్వల్‌.. భయపెడతానంటున్న సీనియర్‌ నటి

JSR
సౌత్ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా పి వాసు దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్‌ హిట్ సినిమా చంద్రముఖి. తమిళ్‌లో పాటు తెలుగులోనూ ఘన విజయం సాధించిన ఈ సినిమాను తరువాత బాలీవుడ్‌లో భూల్‌ భులయ్యా రుతో రీమేక్‌ చేశారు. ప్రియదర్శన్‌ దర్శకత్వంలో అక్షయ్‌ కుమార్‌, అమీషా పటేల్‌, విద్యా బాలన్‌, షినే అహుజా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా కూడా ఘన విజయం సాధించింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌ను రూపొందించేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

టాలీవుడ్‌లో చంద్రముఖి సీక్వెల్‌గా వెంకటేష్‌ హీరోగా నాగవల్లి సినిమాను రూపొందించారు అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తాజాగా బాలీవుడ్‌ చంద్రముఖి.. భూల్‌ భులయ్యా సినిమాకు సీక్వెల్‌ను రూపొందిస్తున్నారు  చిత్రయూనిట్. అనీస్‌ బజ్మీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యంగ్ హీరో కార్తీక్‌ ఆర్యన్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. కార్తీక్‌కు జోడిగా హాట్ బ్యూటీ కియారా అద్వాని నటిస్తుండగా మరో కీలక పాత్రలో సీనియర్‌ నటి టబు నటిస్తోంది.

తొలి భాగంలో విద్యాబాలన్‌ పోషించిన తరహా పాత్రలో టబు నటిస్తుందన్నటాక్‌ వినిపిస్తోంది. సౌత్‌లో జ్యోతిక అద్భుతమైన పర్ఫామెన్స్‌తో ఆకట్టుకోగా హిందీ విద్యా బాలన్‌ ఆస్థాయిలో అలరించలేకపోయింది. దీంతో ఇప్పుడు టబు అయినా ఆ పాత్రకు న్యాయం చేస్తుందా అన్న చర్చ మొదలైంది. ఆదివారం ఈ సినిమా షూటింగ్‌ను జైపూర్‌లో లాంచనంగా ప్రారంభించారు. ఈ సినిమాను జూలై నెలాఖరున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
Iss look mein Smile hi nahi rukti 🔥 Ting ding ting tiding ting ting 🎶❤ #BhoolBhulaiyaa2 💀 #Jaipur lets Roll 🤟🏻 Mango Season Begins 😂

A post shared by KARTIK AARYAN (@kartikaaryan) on

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: