కరోనా ఇక మా చేయి దాటిపోయింది.... చైనా అధ్యక్షుడి సంచలన ప్రకటన

Arun Showri Endluri
చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి ఇప్పట్లో నియంత్రణలోకి వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆ దేశ అధ్యక్షుడు క్సి జింపింగ్ కీలక ప్రకటన చేశారు. చైనాలో ప్రబలిన కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో జిన్ పింగ్ ఎట్టకేలకు స్పందించారు. ఇది తమ దేశంలో అతిపెద్ద హెల్త్ ఎమర్జెన్సీ అని దాన్ని నియంత్రించేందుకు సకల ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన ప్రకటించారు.

శరవేగంగా వ్యాపిస్తున్న వైరస్ను నియంత్రించడం కష్టమవుతోందని ఆయన అన్నారు. అయితే ఇప్పటికీ తాము తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని…. కానీ అనుకున్న దానికన్నా ఎక్కువ మంది జనం ఈ మహమ్మారి వల్ల చనిపోవడం చాలా భాధాకరమని ఆయన వెల్లడించాడు.

చైనాలో కరోనా వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య అధికారికంగానే 77 వేలు దాటింది. ఇప్పటివరకు 2,400 మందికిపైగా చనిపోయారు. చైనాలో కొత్తగా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య మెల్లగా తగ్గుతూ వస్తున్నా.. దానికి సమీపంలో ఉన్న జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో పెరుగుతోంది. దీంతో దక్షిణ కొరియాతోపాటు ఇటలీ వంటి పలు దేశాల్లో పరిరక్షణ చర్యలు మొదలుపెట్టారు.

కరోనా వైరస్ వ్యాప్తిని త్వరలోనే అరికట్టగలమని జిన్ పింగ్ చెప్పినా అది ఆ దేశ ప్రజలను భయభ్రాతులను చేయకుండా ఉండేందుకు అని అర్థమవుతోంది. ‘‘ఇది మనకు ఒక సంక్షోభం.. ఇదో పెద్ద పరీక్ష. చైనా ఏర్పాటైన 1949 సంవత్సరం తర్వాత ఇది అతిపెద్ద హెల్త్ ఎమర్జెన్సీ. అనివార్యంగా ఇది మన సమాజంపై, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది" అని ఆయన అన్నారు.

అయితే త్వరలోనే పరిస్థితి చక్కబడుతుంది. ఈ పరిస్థితి కొంత కాలమే ఉంటుంది అని చైనా ప్రజలకు భరోసా అయితే ఇచ్చారు కానీ కరోనా ను అణిచివేసేందుకు శాస్త్రవేత్తలు ఇంకా తలలు పట్టుకుంటునారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: