స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలుగుతున్న సిమ్రాన్...ఉన్నపళంగా కనుమరుగైంది ఎందుకో తెలుసా?
ప్రియా ఓ ప్రియా, మా నాన్నకి పెళ్ళి, ఆటోడ్రైవర్, సమరసింహారెడ్డి, నర్సింహనాయుడు, కలిసుందాంరా, నువ్వొస్తావని, యువరాజు, డాడి, ప్రేమతోరా, సీతయ్య మంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి సూపర్ డూపర్ హిట్స్ కొట్టడమే కాకుండా తెలుగు ప్రేక్షకులను అలరించింది. అయితే సిమ్రాన్ తమిళంలో కూడా కొన్నాళ్ళు తన హవాని కొనసాగించింది. జోడి, జుల్లాదమనం, వాలి, పంబల్కే సంబంధం, ఏలుమళై ఇలా ఎన్నో చిత్రాల్లో నటించింది. ఇక పర్సనల్ లైఫ్ విసజ్ఞానికి వస్తే కెరియర్ మంచి పీక్స్‌లో ఉన్నప్పుడే దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టింది ఈ భామ. తన చిన్ననాటి మిత్రుడు దీపక్ తో 2003లో వివాహం జరిగింది. వారిద్దరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెళ్ళయ్యాక కూడా చిన్న చిన్నగా అప్పుడప్పుడు కనిపిస్తూ సినీ ఇండస్ట్రీతో టచ్‌లోనే ఉంది ఈ ముంబై భామ. బాలయ్య సినిమాతో వచ్చిన ఒక్కమగాడు చిత్రంతో నటన కంటిన్యూ చేసింది. ఆమె తన భర్తతో కలిసి ఓ ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ట్ చేసింది. సిమ్రాన్ కేవలం సినిమాలకే కాదు. ఎన్నోసార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులను కూడా అందుకుంది.