ప్రభాస్ తో చేయబోయే సినిమా పాన్ ఇండియా మూవీ కాదట....!!
టాలీవుడ్ బాహుబలి రెబల్ స్టార్ ప్రభాస్, గత ఏడాది సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన సాహో సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా ఎంతో భారీ ఖర్చుతో తెరకెక్కిన ఆ సినిమా పెద్దగా సక్సెస్ ని అయితే అందుకోలేకపోయింది. ఇక ఆ తరువాత తన తదుపరి సినిమాగా ప్రస్తుతం జిల్ మూవీ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న ప్రభాస్, ఆ సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఈసారి ఎలాగైనా మంచి హిట్ కొట్టి, దానిని తన ఫ్యాన్స్ కి కానుకగా ఇవ్వాలని భావిస్తున్న ప్రభాస్, స్క్రిప్ట్ విషమైన కూడా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు టాక్.
ఇకపోతే ప్రభాస్ నటించబోయే తదుపరి సినిమా కు సంబంధించి కాసేపటి క్రితం అధికారిక ప్రకటన ఒకటి రావడం జరిగింది. యువ దర్శకుడు నాగ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ సంస్థ 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ లెవెల్లో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు టాక్. ఇక ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు నాగ వంశీ కాసేపటి క్రితం తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా ఒక ఆసక్తికర విషయాన్ని ప్రభాస్ ఫ్యాన్స్ కి తెలిపారు.
ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది లాస్ట్ లో ప్రారంభం అవుతుంది, అలానే వీలైనంత త్వరగా షూటింగ్ ని పూర్తి చేసి, వచ్చే ఏడాది ఎండింగ్ లో సినిమాని రిలీజ్ చేస్తాం అని చెప్పిన అశ్విన్, అందరూ తనను ఇది ఒక పాన్ ఇండియా రేంజ్ మూవీనా అని అడుగుతున్నారని, అయితే ఇది పాన్ ఇండియా ఫిలిం కాదు, పాన్ వరల్డ్ ఫిలిం అని వంశీ తన ట్వీట్ ద్వారా తెలిపారు. ఇక దీనితో ఆ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ లో మరింతగా అంచనాలు పెరిగాయి. మరి ఇటీవల మహానటి సినిమాతో సూపర్ హిట్ కొట్టిన వంశీ, ఈ సినిమాని ఏ విధంగా తెరకెక్కిస్తారో చూడాలి....!!
Shoot year end lo start...maybe 2021 end lo release...too early to say anything else, expect a big thanks to prabhas garu...kontha mandi pan-india film antunnaru...adi tappu...pan-india eppudo kottesaaru...idi pan-world darlings :)) #PrabhasNagAshwin https://t.co/9KnLQqbVgm — Nag Ashwin (@nagashwin7) February 26, 2020