సీరియళ్లలో  యాక్ట్ చేస్తూనే రోడ్డు పక్కన దోశలు వేస్తోంది... ఎందుకో తెలుసా?

Balachander

మాములుగా ఒక్కసారి ముఖానికి రంగు వేసుకోవడం అలవాటు చేసుకున్నాక, మరో పని చేయడానికి ఆసక్తి చూపించరు.  దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనుకుంటారు.  అలా అనుకోని చాలామంది వచ్చిన డబ్బును జాగ్రత్త చేసుకుంటూ అడుగులు ముందుకు వేస్తుంటారు.  కానీ, కొందరు మాత్రం డబ్బు చేతిలో ఉన్నప్పుడు విచ్చల విడిగా ఖర్చు చేసి ఆ తరువాత ఇబ్బందులు పడుతుంటారు.  లేనిపోని చిక్కుల్లో ఇరుక్కుంటారు.  


ఇలా చాలామంది నటీనటులు చిక్కుల్లో పడ్డారు.  కొంతమందైతే పాపం వ్యభిచార కూపంలో కూరుకుపోయి రోగాల బారిన పడుతూ ఇబ్బందులు పడిన సంగతి చూస్తూనే ఉన్నాం.  ఓ నటి మాత్రం వాటిని దృష్టిలో పెట్టుకొని చాలా ఛాయకచక్యంగా పనిచేయడం మొదలుపెట్టింది.  ఆమె ఓ సీనియర్ నటి కూడా.  అనేక సీరియల్స్ లో యాక్ట్ చేసింది.  ఎన్నో అవార్డులు కూడా గెలుచుకుంది.  


కానీ, ఎప్పుడు కూడా చేస్తున్న పని నుంచి బయటకు వెళ్ళలేదు.  వరసగా సీరియల్స్ లో నటిస్తూనే పిల్లలకు ఇబ్బందులు రాకూడదు అని చెప్పి రాత్రి వేళల్లో హైవే పక్కన తనకు వచ్చిన వంటనే సంపాదనగా మలుచుకుంది.  వచ్చిన డబ్బులతో దోశల బిజినెస్ ప్రారంభించింది.  ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో టీవీ సీరియల్స్ లో నటిస్తూ, సాయంత్రం సమయంలో ఆమె ఇలా రోడ్డు పక్కన టిఫిన్ బిజినెస్ చేస్తున్నది.  


వెన్నేళ్లకు చన్నీళ్ళు అన్న చందాన ఆమె ఇలా సంపాదించుకుంటోంది.  తన ఇద్దరు పిల్లలను చదివించుకుంటోంది.  ఇద్దరు పిల్లలను చదివించుకుంటూ అన్నింటిని దగ్గరుండి చూసుకుంటోంది.  13 ఏళ్ల క్రితం భర్త నుంచి ఆమె విడిపోయింది.  అలా విడిపోయిన ఆ మహిళ టీవీ సీరియళ్ళులో యాక్ట్ చేయడం మొదలుపెట్టింది.  సీరియల్స్ లో ఆమెకు మించిన నటి మలయాళంలో లేరు.  అయినా సరే వచ్చిన డబ్బును పొదుపుగా వాడుకుంటూ, ఎలాంటి ఇగోలకు పోకుండా ఉన్న డబ్బుతో ఇలా చిన్న బిజినెస్ చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తోంది కవితా  లక్ష్మి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: