ఆ డైరెక్టర్‌తో హీరో అమ్మకు ఎఫైర్... అందుకేనా గొడవలు...?
చిత్ర పరిశ్రమలో హీరో హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు ఇలా అనేక మంది మధ్య లవ్ ఎఫైర్లు, డేటింగ్ గాసిప్‌లు అనేవి ఈ మధ్య చాలా సాధారణం అయిపోయాయి. అయితే సినీ పరిశ్రమలో ఎఫైర్లు సత్సంబంధాల్ని దెబ్బ కొడతాయి. అందుకే అలాంటి రిలేషన్స్ బయటకు రాకుండా జాగ్రత్త పడతారు. కానీ, దురదృష్టం ఏంటంటే.. ఏదో విధంగా అవి బయటకు వచ్చ రచ్చ రచ్చ చేస్తుంటాయి. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. ఆ డైరెక్టర్‌తో హీరో అమ్మకు ఎఫైర్. టాలీవుడ్లో ఓ యంగ్ హీరో మరియు డైరెక్టర్ మధ్య గత కొన్ని రోజులుగా ఇంట్రస్టింగ్ ఫైట్ జరుగుతోంది.
అసలు విషయం బయటకు రాకుండా వీరిద్దరు చాలా జాగ్రత్తగా మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. సదరు యంగ్ హీరో విషయానికి వస్తే.. సొంత బ్యానర్లోనే తమ అభిరుచికి తగిన సినిమాలను తెరకెక్కిస్తూ విజయాలను సొంతం చేసుకొంటూ ముందుకెళ్తున్నాడు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త కథలను ఎంచుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చి మ్యాజిక్ చేస్తుంటాడు. అలాగే సదరు డైరెక్టర్ కూడా చేసింది అతి తక్కవ సినిమాలే అయినా మంచి దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు. అయితే గతంలో వీరిద్దరూ ఓ సినిమాకు పనిచేశారు. ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. దాంతో ఆ యంగ్ హీరోకు.. సదరు డైరెక్టర్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదుగాని వీరిద్దరూ విడిపోయి.. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకోవడం స్టాట్ చేశారు.
దీంతో వీరిద్దరు మధ్య ఏం జరిగింది.. ఎందుకిలా దెబ్బలాడుకుంటున్నారు..? అన్న ప్రశ్నలతో కొందరు ఆలోచనలో పడ్డారు. ఇక సదరు హీరో ఇటీవల ఓ హిట్ సినిమా కొట్టాడు. మరోవైపు సదరు డెరెక్టర్ కూడా ఆ హీరోను మించి ఓ సూపర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఎంతో స్నేహంగా ఉండే వీరిద్దరి మధ్య గొడవలు ఎందుకు స్టాట్ అయ్యాయని చూస్తే.. దానికి ప్రధాన కారణం సదరు హీరో తల్లికి మరియు ఆ డైరెక్టర్‌కు ఎఫైర్ ఉన్నట్టు ఇండస్ట్రీ వర్గాలో చర్చలు నడుస్తున్నాయి. ఈ విషయం తెలిసిన సదరు యంగ్ హీరో ఆ డైరెక్టర్‌ను పూర్తిగా దూరం పెట్టాడని పుకార్లు నడుస్తున్నాయి. అయితే ఇది ఎంత వరకూ వాస్తవం అనేది ఇప్పటి వరకు తెలియలేదు.