నితిన్ కు షాకిచ్చిన తెలంగాణ ఆర్టీసీ.. కేటీఆర్ కు చిత్ర యూనిట్ ఫిర్యాదు ..

Satvika

నితిన్, రష్మిక మందన్న నటించిన 'భీష్మ'... వెంకీ కుడుమల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే.ఇటీవల విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. కాగా, విడుదలయిన కొద్దీ రోజులకే  సినిమా ఫైరసీ కావడం పై చిత్ర యూనిట్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 


అహర్నిశలు కష్టపడటమే కాకుండా కోట్లు పెట్టి సినిమా తీసిన చిత్ర నిర్మాతల లావాదేవీలకు గండి పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేసారు. సినిమా విడుదల అయినా వెంటనే పైరసీ అవుతుండటం పై తెలుగు చిత్ర నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో నితిన్ సినిమా భీష్మ కూడా పైరసీకి గురికాక తప్పలేదు. 

 


వివరాల్లోకి వెళితే..  తెలంగాణ ఆర్టీసీ బస్సులో ‘భీష్మ’ సినిమాను ప్రదర్శించడం కలకలం రేపింది. హైదరాబాద్ నుంచి ఖమ్మం జిల్లా వెళ్తున్న టీఎస్ ఆర్టీసీ లగ్జరీ బస్సులో ఫైరసీ సినిమాను ప్రదర్శించారు. అయితే అదే బస్సులో ఉన్న నితిన్ ఫ్యాన్ ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఈ విషయం పై  వెంటనే స్పందించిన హీరో  నితిన్.. చిత్ర దర్శకులకు సమాచారాన్ని అందించారు. అంతేకాకుండా ఫిలిం ఛాంబర్ పైరసీ వ్యతిరేక విభాగం దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేశాడు. 

 

 

పూర్తి వివరాలను పరిశీలించిన కమిటీ వారు నిన్న హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్నీ డైరెక్టర్ ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాడు. తాజాగా స్పందించిన .. బస్సుల్లో పైరసీ చిత్రాలు ప్రదర్శించకుండా చూడాలని రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు ట్వీట్ చేశారు. నితిన్ సినిమా ఫైరసీ పై తెలుగు రాష్ట్రాల్లోకి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చిత్ర యూనిట్ మండిపడుతుంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: