చిరు మూవీలో బాలీవుడ్ స్టార్ కి ఛాన్స్..
టాలీవుడ్ లో పదేళ్ల విరామం తర్వాత మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ మూవీతో హీరోగా రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవి అనుకున్న అంచనాలు దాటి బాక్సాఫీస్ షేక్ చేసింది. ఈ మూవీ సక్సెస్ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నరసింహారెడ్డి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీ అనుకున్న స్థాయిలో హిట్ కాలేకపోయింది. అయితే ఇప్పుడు కొరటాలీ శివ దర్శకత్వంలో 152వ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి షూటింగ్ షరవేగంగా జరుగుతుంది. చిరంజీవి పుట్టిన రోజు వరకు ఈ మూవీ కంప్లీట్ చేసి రిలీజ్ చేసే యోచనలో ఉన్నారు దర్శకులు. ఈ మూవీ దేవాలయాల మాఫియాకు సంబంధించి ఉండబోతున్నట్లు టాక్. అంతే కాదు ఈ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారట.
అయితే మహేష్ బాబు.. కొరటాల, చిరంజీవిలతో ఉన్న అనుబంధంతో ఈ పాత్రలో నటించడానికి ఒప్పుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. తాజాగా బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్లో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న నటుడు సోనూసూద్ మెగాస్టార్ 152 మూవీలో ఛాన్స్ కొట్టినట్టు టాక్ వినిపిస్తుంది. చిరుతో కలిసి నటిస్తున్న విషయాన్ని సోనూ తాజాగా ధ్రువీకరించాడు. చిరుతో తెర పంచుకోవడం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపాడు. కోడీ రామకృష్ణ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘అరుంధతి’ మూవీలో విలన్ గా నటించాడు సోనూ సూద్.
ఈ మూవీ సోనూ సూద్ కి మంచి గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన సోనూ సూద్ అంటే తెలుగు ప్రేక్షకులకు మంచి సుపరిచితుడే. ప్రస్తుతం బాలీవుడ్ లో ఎక్కువగా నటిస్తున్నాడు అంతే కాదు ప్రస్తుతం తమిళలో 'తమిలరసన్' అనే సినిమాతో పాటు బాలీవుడ్లో అక్షయ్ కపూర్‌తో కలిసి 'పృథ్వీరాజ్' అనే మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీపై ఇప్పటకే భారీ అంచనాలు నెలకొంటున్నాయి.