హమ్మయ్య అనుకుంటున్న టాలీవుడ్...!

Gullapally Venkatesh

ఈ ఏడాది చాలా సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. అందులో పెద్ద హీరోల సినిమాలు చిన్న హీరోల సినిమాలు ఉన్నాయి. కాని ఆదిలోనే టాలీవుడ్ కి పెద్ద దెబ్బ తగలిగింది. సంక్రాంతికి కేవలం ఒక్కటే ఒక్క సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఒక్క అల వైకుంఠపురములో సినిమా మినహా ఏ ఒక్కటి హిట్ అవ్వలేదు. మహేష్ బాబు సినిమా ఫ్లాప్ అనే టాక్ తోనే వసూళ్లు సాధించింది. అది కూడా చిత్ర యూనిట్ చెప్పడమే గాని నిజం ఎంతో తెలిదు. సంక్రాంతి తర్వాత మంచి సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూసారు. 

 

మంచి సినిమా మాత్రం ఒక్కటి అంటే ఒక్కటి కూడా రాలేదు ఈ మధ్య కాలంలో. రవితేజా నటించిన డిస్కో రాజా, విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ శర్వానంద్ జాను సినిమాలు భారీ అంచనాలతో వచ్చి ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి. ఆ తర్వాత వచ్చిన భీష్మ సినిమా మాత్రం హమ్మయ్య అనిపించింది. ఆ సినిమా మంచి హిట్ ఇచ్చింది. దీనితో ప్రేక్షకులకు మంచి సినిమా దొరికింది అనే చెప్పవచ్చు. ఇక తాజాగా వచ్చిన హిట్ సినిమా మంచి హిట్ ఇచ్చింది టాలీవుడ్ కి. స్లో గా ఉంది నే పేరే గాని సినిమా మాత్రం ఆకట్టుకుంది. 

 

నటన పరంగా సినిమా కథ పరంగా కూడా ఈ సినిమా మంచి మార్కులే కొట్టేసింది అని చెప్పుకోవచ్చు. దీనితో చాలా రోజుల తర్వాత కాస్త టాలీవుడ్ జనాలు మంచి సినిమా చూసారు. రెండు వరుస హిట్స్ రావడంతో హమ్మయ్య అనుకున్నారు. ఇప్పట్లో టాలీవుడ్ లో విడుదల అయ్యే సినిమాలు ఏమీ లేవు. చిన్న చిన్న సినిమాలు ఉన్నా అవి పెద్ద లెక్కలోకి రావనే చెప్పాలి. ఇక వేసవి మాత్రం టాలీవుడ్ పెద్ద సినిమాలకు వేదిక అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: