అదరహో అనే రేంజ్ లో 'కార్తికేయ - 2' కాన్సెప్ట్ వీడియో ....!!

GVK Writings

శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన హ్యాపీ డేస్ సినిమాలోని నలుగురు యువకుల్లో ఒకడిగా నటించిన నిఖిల్ సిద్దార్థ, తొలి సినిమాతోనే మంచి నటుడిగా తెలుగు ప్రేక్షకుల మనస్సులో మంచి పేరు సంపాదించాడు. ఇక ఆ తరువాత నుండి తన ఆకట్టుకునే నటనతో ప్రేక్షకులను అలరిస్తూ, మెల్లగా అవకాశాలతో ముందుకు సాగుతున్న నిఖిల్, గత ఏడాది అర్జున్ సురవరం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ప్రస్తుతం ఆయన నటిస్తున్న తాజా సినిమా కార్తికేయ 2. కొన్నేళ్ల క్రితం నిఖిల్, స్వాతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో మంచి సక్సెస్ సాధించింది. ఒక మారుమూల పల్లెటూరులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోవెల మూత పడి ఉండడం, దానిని తెరవడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వారు పాము కాటుకు గురి కావడం జరుగుతుంది. 

 

అయితే ఆ రహస్యాన్ని ఛేదించి చివరికి అదంతా కొందరు దుర్మార్గులు పన్నిన పన్నాగం అని తెలుసుకుని వారి ఆట కట్టించి మొత్తానికి ఆ కోవెలను తెరిపిస్తాడు హీరో. పలు ఆకట్టుకునే సీన్స్, ట్విస్టులతో సాగె ఆ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ రేపటి నుండి అధికారికంగా ప్రారంభం కానుందని, అలానే ఆ సినిమా యొక్క కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించి యూనిట్ ఒక వీడియో ని కాసేపటి క్రితం రిలీజ్ చేసింది. 

 

పీపుల్స్ మీడియా ఫాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో 5118 సంవత్సరాల క్రితం జరిగిన యుగాంతం సమయంలో ఎంతో విలువైన జ్ఞాన సంపద కూడా కాల గర్భంలో కలిసిపోవడం, ఇక దానిని సాధించడానికి ప్రస్తుతం కొందరు దుండగులు ప్రయత్నిస్తుండడం, వారిని హీరో ఎలా ఎదిరించి ఆ సంపదను కాపాడాడు అనే కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కనుందని వీడియో ని బట్టి చూస్తే మనకు అర్ధం అవుతుంది. ఎంతో భారీ ఖర్చుతో, అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ ఎంతో వేగంగా పూర్తి చేసి, దీపావళి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు టాక్. మరి ఈ సినిమా ఎంత మేర విజయాన్ని అందుకుంటుందో చూడాలి...!! 

" height='150' width='250' src="https://www.youtube.com/embed/dSBvr_xMkU0" width="560" height="315" data-framedata-border="0" allowfullscreen="allowfullscreen">

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: