టాలీవుడ్‌లో నెంబ‌ర్ 1 రాజ‌మౌళి... నెంబ‌ర్ 2 ఎవ‌రు... ?

VUYYURU SUBHASH
టాలీవుడ్ చరిత్రలో ఏ డైరెక్టర్ కాదు... ఏ హీరో కూడా చేరుకోలేనంత ఎత్తుకు చేరిపోయాడు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తో ప్రారంభమైన రాజమౌళి ప్రస్థానం బాహుబలి ది కంక్లూజన్ సినిమాతో ఏకంగా అంతర్జాతీయ స్థాయికి చేరిపోయింది. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే కేవలం తెలుగు భాష వరకే పరిమితం అన్న నానుడి ఉండేది. ఇప్పుడు దానిని అంతర్జాతీయ స్థాయికి వెళ్లేలా చేసిన ఘనత నూటికి నూరుశాతం రాజమౌళిదే. తెలుగు సినిమా మార్కెట్ కు... తెలుగు సినిమా పరిధికి ఎల్లలు లేవని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత రాజమౌళిదే అనటంలో ఎలాంటి సందేహం లేదు.



బాహుబ‌లి ది కంక్లూజ‌న్ సినిమా ఏకంగా రు. 2 వేల కోట్లు సాధించి బాలీవుడ్  జ‌నాలు సైతం ముక్కున వేలేసుకునేలా చేసింది. ఇప్పుడు దేశం అంతా తెలుగు సినిమా వైపు చూస్తుందంటే అందుకు రాజమౌళికే క్రెడిట్ ఇవ్వాలి. ఇక తెలుగులో రాజ‌మౌళి నెంబ‌ర్ వ‌న్ డైరెక్ట‌ర్‌. ఈ విష‌యంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇప్పుడు రాజ‌మౌళి త‌ర్వాత రెండో ప్లేస్‌లో ఉన్న ద‌ర్శ‌కుడు ఎవ‌రు ? అన్న ప్ర‌శ్న‌కు ఆన్స‌ర్ ర‌క‌ర‌కాలుగా వినిపిస్తోంది.



ఈ ప్లేస్ కోసం ప్ర‌ధానంగా ఇద్ద‌రు పేర్లు వినిపిస్తున్నాయి. ఒక‌రు మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌. మ‌రొక‌రు కొర‌టాల శివ‌. కొర‌టాల శివ చేసిన నాలుగు సినిమాలు సూప‌ర్ హిట్. వాస్త‌వానికి అంత‌కు ముందు ఈ రికార్డు త్రివిక్ర‌మ్‌కే ఉండేది. త్రివిక్ర‌మ్ నెంబ‌ర్ 2లో ఉండేవాడు. అజ్ఞావాసి దారుణ‌మైన ప్లాప్ త‌ర్వాత త్రివిక్ర‌మ్ రేసులో వెన‌క‌ప‌డితే కొర‌టాల రెండో స్తానంలోకి దూసుకు వ‌చ్చాడు. ఇప్పుడు అల సూప‌ర్ హిట్‌తో ఈ ఇద్ద‌రిలో నెంబ‌ర్ 2 ఎవ‌ర‌నేది క్రిటిక్స్‌కు కూడా అర్థం కాని ప‌రిస్థితి. ఈ నెంబ‌ర్ 2 గేమ్ అనేది ఎప్పుడూ మారుతూ ఉంటుంది. రేపు కొర‌టాల - చిరు సినిమా రిజ‌ల్ట్‌ను బ‌ట్టి ఇది మ‌ళ్లీ మార‌డం ఖాయ‌మే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: