ఆలస్యమవుతుందని ఆటోలో వెళ్లిన హీరోయిన్‌..!

JSR
విలాసవంతమైన ఎన్నో కార్లు ఉన్న బాలీవుడ్ హాట్ బ్యూటీ రవీనా టండన్‌ తన బంధువుల ఇంట్లో జరుగుతున్న ఓ వేడుకకు హాజరయ్యేందుకు ఆటోలో వెళ్లింది. తనతో పాటు తన కూతురు రషాను కూడా ఆటోలోనే తీసుకెళ్లింది రవీనా. అసలు తాను ఆటోలో వెళ్లాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో తన సోషల్ మీడియా పేజ్‌ ద్వారా అభిమానులకు వివరించింది ఈ బ్యూటీ.

`ఆటోలో ప్రయాణిస్తున్నాం.. కారు కోసం వేచి చూస్తే మా బంధువుల మొహందీ ఫంక్షన్‌కు ఆలస్యమయ్యేలా ఉంది. రషాతో కలిసి ఆటో రైడ్‌ ఎంతో ఆనందంగా ఉంది. ముంబై ఆటో వాలాలు అందరు రక్షకులు` అంటూ తన ఆటో ప్రయాణాన్ని వీడియో తీసి మరి తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో పోస్ట్ చేసింది రవీనా. మరో వీడియోలో ఆ ఆటో డ్రైవర్‌ రవీనా నటించిన సినిమా గురించి వివరించిన విషయాన్ని కూడా పోస్ట్ చేసింది.

ఇక సినిమాల విషయానికి వస్తే చాలా కాలంగా వెండితెరకు దూరంగా ఉన్న రవీనా ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న కే జీ ఎఫ్‌ 2లో కీలక పాత్రలో నటిస్తోంది. కన్నడ యంగ్ హీరో యష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకుడు. ఈ సినిమా తొలి భాగం కన్నడతో పాటు తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
Jumped into an {{RelevantDataTitle}}