ఫస్టాఫ్ ఫట్.... సెకండాఫ్ హిట్ అయ్యిందే బొమ్మ...!
ఫిబ్రవరిలో 18 సినిమాల్లో భీష్మ, హిట్ సినిమా తప్ప మిగిలిన అన్ని సినిమాలు ఘోరంగా తన్నేశాయి. ఇక శర్వానంద్ - సమంత జాను, విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ ప్లాప్ అవ్వగా మిగిలిన సినిమాల పేర్లు కూడా గుర్తు లేని పరిస్థితి. జనవరి 31 న విడుదలైన నాగశౌర్య అశ్వత్థామ' తో ఫిబ్రవరి నెల నీరసంగా ప్రారంభమైంది. ఈ సినిమా లాభాలు తీసుకురాలేకపోయింది. ఇక మూడో వారంలో మహాశివరాత్రి కానుకగా వచ్చిన భీష్మ సినిమా వరకు ఫిబ్రవరిలో ఒక్క హిట్ లేదు.
ఇక చివరి వారంలో వచ్చిన హిట్ యావరేజ్ టాక్ తో డీసెంట్ కలెక్షన్స్ నమోదు చేస్తోంది. ఈ సినిమా లాభాల్లోకి వచ్చేసింది. ఇలా ఫిబ్రవరి నెల ఫస్టాఫ్ అంతా ఫట్ అయితే.. సెంకడాఫ్ మాత్రం ఓ హిట్... మరో యావరేజ్‌తో కాస్త టాలీవుడ్‌కు ఊపిరి లూదింది. ఇక మార్చి నెలలో చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడం.. మరో వైపు పరీక్షల సీజన్, దీనికి తోడు ఐపీఎల్ ఉండడంతో బాక్సాఫీస్ నుంచి ఫిబ్రవరిలో కూడా పెద్ద సంచలనాలు ఆశించక్కర్లేదు. ఇక ఏప్రిల్ నుంచి కాస్త ఊపు వస్తుందేమో ? చూడాలి.