వామ్మో..4 ని.ల ముద్దా... 30 ఏళ్ల క్రితమే టాలీవుడ్ ను ఊపేసిన ఎంగిలి ముద్దు..?
ఓం నమః హృదయ లయలకు ఓం
ఓం నమః అధర జాతులకు
ఓం నమః మధుర స్మృతులకు ఓం
నీ హృదయం తపన తెలిసి నా హృదయం కనులు తడిసేవేళలో..
ఈ మంచు బొమ్మలొకటై కలిసి కరిగే లీలలో
రేగిన కోరికలతో గాలులు వీచగా
జీవన వేణువులలో మోహన పాడగా
దూరము లేనిది..లోకము తోచగా..
కాలము లేనిది..గగనము అందగా..
సూరేడే ఒదిగి ఒదిగి జాబిల్లి ఒడిని అడిగే వేళా
ముద్దుల సద్దుకే నిదుర రేగే ప్రణయ గీతికి ఓం..
ఒంటరి బాటసారి జంటకు చేరరా
కంటికి పాపవైతే రెప్పగ మారనా
తూరుపు నీవుగా..వేకువ నేనుగా..
అల్లిక పాటగా పల్లవి ప్రేమగా..
ప్రేమించే పెదవులొకటై పొంగించే సుధలు మనవైతే
జగతికే అథిదులై జననమందిన ప్రేమ జంటకు ఓం.. ఓం నమః ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం తెలుగులో నేరుగా దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం ఇది. అక్కినేని నాగార్జున, గిరిజ ప్రధాన పాత్రలు పోషించారు. సంగీతం ఇళయరాజా సమకూర్చారు. ఈ చిత్రం తమిళం మరియు మలయాళం భాషలలోకి కూడా డబ్బింగై అక్కడా విజయం సాధించింది.