లిప్ లాక్ అనగానే మనకు ఫస్ట్ గుర్తుకు వచ్చే టాలీవుడ్ మూవీ అదే....!!
ప్రస్తుతం తో పోలిస్తే ఒకప్పుడు సౌత్ సినిమాల్లో మరీ ముఖ్యంగా తెలుగు సినిమాల్లో లిప్ లాక్ సన్నివేశాలు చాలా తక్కువగా ఉండేవి. దానికి ప్రధాన కారణం ప్రేక్షకులు ఎక్కువగా కథ, కథనాలు నటీనటుల యొక్క పాత్రల ప్రాధాన్యం గురించి మాత్రమే ఆలోచించే వారు. అయితే అవసరం మేరకు అక్కడక్కడా కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నప్పటికీ అటువంటి సీన్స్ మాత్రం చాలా తక్కువ సినిమాల్లోనే ఉండేవి. అయితే రాను రాను ప్రేక్షకుల అభిరుచి మారడంతో పాటు పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడిన మన ప్రేక్షకులు కూడా సినిమాల్లో రొమాంటిక్ సీన్స్, లిప్ లాక్ సన్నివేశాలు వంటివి ఎక్కువగా ఆశిస్తున్నారు.
ఇక ఆ విధంగానే నేటి తరం దర్శకులు కూడా సినిమాలు తీస్తుండడంతో పాటు, హీరో హీరోయిన్లు కూడా ఆ తరహా సన్నివేశాల్లో నటించక తప్పని పరిస్థితి నెలకొంది. ఇక టాలీవుడ్ లో ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో నాగార్జున, గిరిజ కలిసి నటించిన గీతాంజలి సినిమాలోని రొమాంటిక్ లిప్ లాక్ సీన్ ని మన తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు అనే చెప్పాలి. కొన్నేళ్ళ క్రితం యువసామ్రాట్ నాగార్జున హీరోగా నూతన నటి గిరిజ హీరోయిన్ గా కోలీవుడ్ ప్రఖ్యాత దిగ్గజ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ మూవీ గీతాంజలి.
ఇక ఆ సినిమాలో హృద్యమైన ప్రేమకథతో పాటు ఎమోషనల్ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. ఇక సినిమాలోని ఓం నమః అనే సాంగ్ లో హీరో హీరోయిన్స్ ఇద్దరూ కూడా చాలాసేపు లిప్ లాక్ సీన్స్ లో నటించడం గమనించవచ్చు. చాలా వరకు ఆ పాటలో నాగ్, గిరిజ ఇద్దరూ కూడా రియల్ గానే లిప్ లాక్ సన్నివేశాలు నటించినట్లు మనకు అర్థం అవుతుంది. అప్పట్లో ఆ సినిమాలోని ఆ పాట తో పాటు అందులోని లిప్ లాక్ సీన్స్ నీ ఇప్పటికీ అక్కినేని ఫ్యాన్స్ మర్చిపోలేరు అని చెప్పాలి. ఎంతైనా నాగ్ అంటే నాగే మరి....!!