ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిన లిప్ లాక్స్ ఇవే..?
మొన్నటి వరకు బాలీవుడ్ కి మాత్రమే పరిమితమైన లిప్ లాక్ ట్రెండ్ కాస్త టాలీవుడ్ కి కూడా పాకిపోయింది అన్న విషయం తెలిసిందే. బాలీవుడ్ నుంచి వచ్చిన ఈ ట్రెండ్ ప్రస్తుతం బాలీవుడ్ ని మించిపోయింది టాలీవుడ్ లో . అబ్బో ఆ రొమాన్సులు ఆ లిప్ లాక్ లు... కొన్ని కొన్ని సినిమాలైతే కనీసం చూడలేని పరిస్థితి. అయితే స్టార్ హీరోల సినిమాల దగ్గరనుంచి యువ హీరోల సినిమాల వరకూ అందరూ తమ సినిమాల్లో లిప్ లాక్ సీన్లు తప్పక పెడుతున్నారు. ఇక సగటు ప్రేక్షకుడు కూడా లిప్ లాక్ సీన్లు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తుండడంతో ఇక దర్శక నిర్మాతలు కూడా సినిమాల్లో లిప్ లాక్ సీన్లు పెట్టక తప్పడం లేదు. ఈ మధ్య కాలంలో వచ్చిన చాలా సినిమాలు లిప్ లాక్ సీన్లు తెగ రొమాంటిక్ గా ఉండిపోతున్నాయి.
అయితే ఎన్ని లిప్ లాక్ సీన్లు వచ్చిన ప్రేక్షకులు మాత్రం కొన్ని లిప్ లాక్ లకే బాగా కనెక్ట్ అయి పోతూ ఉంటారు. మరి టాలీవుడ్ లో ఇలా ప్రేక్షకులు ఎక్కువగా కనెక్ట్ అయిన లిప్‌లాక్ సీన్లు ఏవి అంటే ఇప్పుడు తెలుసుకుందాం. అర్జున్ రెడ్డి... అర్జున్ రెడ్డి సినిమాలో లిప్ లాక్ సీన్లు సరికొత్త ట్రెండ్ ను సృష్టించాయి అనే చెప్పాలి. అప్పటివరకు సాదాసీదా లిప్ లాక్ లు మాత్రమే టాలీవుడ్ సినిమాల్లో కనిపించేవి కానీ అర్జున్ రెడ్డి తర్వాత... బాలీవుడ్ సినిమాలకు మించిన లిప్ లాక్ సీన్లు తెలుగు సినిమాలలో కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ శాలిని పాండే మధ్య జరిగే ప్రతి ఒక్క లిప్ లాక్ ప్రేక్షకుడికి కనెక్ట్ అయింది అని చెప్పాలి.
ఇక ఆ తర్వాత ఆర్ఎక్స్ 100 సినిమాలోని రొమాన్స్ లిప్ లాక్ సీన్లు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. అసలు రొమాన్స్ అంటేనే ఏంటో తెలియని ఓ పల్లెటూరి అబ్బాయి కి... సిటీ నుంచి వచ్చిన పాయల్ రాజ్ పుత్.. లిప్ లాక్ ఎలా పెట్టాలో నేర్పించడం... రొమాన్స్ ఎలా చేయాలో నేర్పించడం... ఇవన్నీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయి పోయాయి అని చెప్పాలి. దీంతో చిన్న సినిమా అయినా ఈ సినిమాను బాగా ఆదరించి మంచి విజయాన్ని కట్టబెట్టారు ప్రేక్షకులు. ఇలా టాలీవుడ్లో ఈ రెండు సినిమాల్లో లిప్ లాక్ రొమాన్సులు ఎప్పుడు ప్రేక్షకులకు ఫేవరెట్ గానే ఉంటాయి అని చెప్పాలి.