ఆ మూవీకి నో చెప్పి పెద్ద పొరపాటు చేశాను : నటి అర్చన

Edari Rama Krishna

టాలీవుడ్ లో కొంతమంది నటీ, నటులు బ్లాక్ బస్టర్ మూవీస్ లో ఛాన్సు వచ్చినా ఏదో ఒక కారణంతో మిస్ కావడం తర్వాత తెగ బాధపడిపోవడం చూస్తూనే ఉన్నాం.  అల్లరి నరేష్ నటించిన నేను చిత్రం తో హీరోయిన్ గా పరిచయం అయిన అర్చన  తెలుగుతో పాటు, తమిళ, మలయాళ, కన్నడ చిత్ర పరిశ్రమల్లోనూ పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ఇక తెలుగులో మొదటి సారిగా ఎన్టీఆర్ హూస్ట్ చేసిన బిగ్ బాస్ లో కంటిస్టెంట్ గా పాల్గొంది.  అప్పట్లో అర్చన చివరి వరకు పోరాడింది.. కానీ శివబాలాజీ బిగ్ బాస్ విన్నర్ గా నిలిచారు.  నాగార్జున నటించిన శ్రీరామదాసు చిత్రంలో సీత పాత్రలో కనిపించి మంచి పేరు తెచ్చుకుంది.  ఇటీవల ఓ వ్యాపారవేత్తతో ఆమె వివాహం జరిగింది.  

 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అనేక ఆసక్తికరమైన విషయాలను ప్రస్తావించింది. టాలీవుడ్ ఎప్పటికీ గుర్తుండి పోయే చిత్రాల్లో ఒకటి రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, కాజల్ నటించిన ‘మగధీర’.  ఈ చిత్రం షూటింగ్ సమయంలో రాజమౌళి నుంచి ఒక కబురు వచ్చింది.  ఇందులో ఓ ముఖ్యపాత్రలో నటించాలని.. కానీ అప్పటికే నేను వేరే మూవీలో బిజీగా ఉండటంతో చేయలేను అచి చెప్పాల్సి వచ్చింది. ఆ తరువాత ఆ పాత్రని 'సలోని' చేసింది. శ్రీహరి కి లవర్ గా సలోని నటించారు.  ఈ చిత్రంలో షేర్ ఖాన్ గా శ్రీహరికి ఎంతో మంచి పేరు వచ్చింది.  ఆ పాత్రను చేయలేకపోయినందుకు నేను ఇప్పటికీ బాధపడుతూ వుంటానని చెప్పింది అర్చన.

 

ఆ తర్వాత కూడా నాకు మరో బ్యాడ్ లక్ ఎదురైంది.. స్టార్ డైరెక్టర్ మూవీలో ఛాన్సు వచ్చింది.. అప్పుడు కూడా మరో కారణంతో ఆ చిత్రంలో చేయలేకపోయానని.. ఆ  చిత్రం సూపర్ హిట్ అయ్యిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ రెండు అవకాశాలను సద్వినియోగం చేసుకుని వుంటే నా కెరియర్ వేరేలా ఉండేది. వాటిని వదులుకోవడం నిజంగా నేను చేసిన పొరపాటే" అని చెప్పుకొచ్చింది.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
The best thing I ever did was believing in MYSELF. #nofilter #neitherinside #justplain #pure.

A post shared by Archanaa (@archana_veda) on

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: