ఆ హీరో బిల్డప్‌కు, ఓవర్ యాక్షన్‌తో ఉన్న పరువూ పోయిందే...!
తాజాగా అతడు నటించిన సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. రిలీజ్‌కు ముందే ఏకంగా రు. 31 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా తొలి ఆటకే ఘోరమైన డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ దగ్గర కేవలం వారం రోజులకే ఎత్తేశారు. ఫైనల్ బాక్సాఫీస్ రన్ కూడా ముగిసింది. మొత్తం రు.10 కోట్ల షేర్ రాగా రు. 20 కోట్ల నష్టం వచ్చింది. సినిమాలంటే ఎంతో అభిరుచితో ఉండే ఓ సీనియర్ నిర్మాత తీసిన ఈ సినిమా ఆయన జీవితాన్ని రోడ్డు పాలు చేసేసింది. రు. 20 కోట్ల నష్టంతో చాలా వరకు ఆస్తులు అమ్మేసి మరీ ఆయన కుదేలైపోయాడు.
సదరు హీరోకు పట్టున్న నైజాం ఏరియాలోనూ కేవలం రు 3.85 కోట్లు వచ్చాయి. ఇప్పటికే మూడు వరుస ప్లాపులతో విలవిల్లాడుతోన్న సదరు యంగ్ హీరోకు ఈ సినిమాతో వరుసగా నాలుగో ప్లాప్ రావడంతో ఈ సినిమాపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ హీరో కలలు కల్లలయ్యాయి. ఉన్న పరువూ గోవింద అవ్వడంతో ఇప్పుడు అతడికి అడ్వాన్స్‌లు ఇచ్చిన నిర్మాతలు, అతడితో సినిమాలు చేయాలనుకుంటోన్న వారు కూడా వెనకడుగు వేస్తున్నారు.