కరోనా.. ఇప్పుడు ఈ పేరు చెబితే ప్రపంచమే వణికిపోతోంది. దీని ప్రభావం లోను కాని రంగం అంటూ కనిపించడం లేదు. రాజకీయాలు, ఆటలు, ఆర్థికం, ఆరోగ్యం, వాణిజ్యం.. ఇలా అన్ని రంగాలూ కుదేలవుతున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి సినీ రంగం కూడా చేరిపోయింది. చివరకు ప్రజలకు వినోదం పంచే సినీ రంగం కూడా కరోనా బారిన పడుతోంది.
కరోనాకూ సినిమాకూ లింక్ ఏమిటంటారా.. కరోనా ప్రభావం కారణంగా జనం ఇళ్ల నుంచి బయటకు రావడం తగ్గిస్తున్నారు. అందులోనూ జనం ఎక్కువగా గుమికూడా ప్రాంతాల్లో కరోనా బాగా విస్తరిస్తుంది. అందుకే ఎక్కువగా జనం ఉంటే ప్రాంతాలకు జనం దూరంగా ఉంటున్నారు. మరి సినిమా ధియేటర్లంటే జనంతో కళకళలాడతాయి కదా. అందుకే జనం థియేటర్లకు కూడా కొన్ని రోజులు దూరంగా ఉండే ప్రమాదం కనిపిస్తోంది.
ఇప్పటికే పలు సినిమాల వసూళ్లు తగ్గాయి. అందుకే ముందు జాగ్రత్త చర్యగా పలు సినిమాలు తమ రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసుకుంటున్నాయి. మరికొన్ని సినిమాలు విదేశాల్లో జరగాల్సిన షూటింగ్లను ఆపేశాయి. హాలీవుడ్ కు చైనా ఓ పెద్ద మార్కెట్.. ఇప్పుడు చైనాలో జనం బయటకు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. వచ్చినా ఏదో అత్యవసర పనులపై తప్ప సినిమాలను ఎంజాయ్ చేసే మూడ్ లేదు.
అందుకే పలు సినిమాలను వాయిదా వేసుకుంటున్నాయి. తాజాగా ‘మిషన్ ఇంపాజిబుల్ 7’ చిత్రీకరణ, విడుదలను వాయిదా వేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. మొత్త మీద కరోనా ప్రభావంతో హాలీవుడ్ చిత్ర పరిశ్రమ రెండు నెలలో రెండు బిలియన్ డాలర్లు నష్ట పోయినట్టు ఓ అంచనా ఇక కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న దక్షిణకొరియా, జపాన్, ఇటలీ, ఫ్రాన్స్ ల్లో నెలల తరబడి థియేటర్లు మూసేస్తున్నారు. మరి ఈ కరోనా ప్రభావం ఎన్నాళ్లుంటుందో...?
మరింత సమాచారం తెలుసుకోండి: