టాలీవుడ్‌లో విషాదం.. సీనియర్ నటుడు ఆకస్మిక మరణం.. !

venugopal

గత కొద్దిరోజులుగా టాలీవుడ్ చిత్రపరిశ్రమ సీనియర్ యాక్టర్స్‌ను కోల్పోతు వస్తుంది.. ఈ మధ్య కాలంలో మంచి నటులతో పాటుగా, డైరెక్టర్లు కూడా దూరమయ్యారు.. ఈ విషాదాల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది..

 

 

ఈ క్రమంలోనే సుమారుగా తెలుగులో 1000 కి పైగా సినిమాల్లో కనిపించిన సీనియర్ ఆర్టిస్ట్ తుదిశ్వాస విడిచారు.. ఆయన పేరు జనార్ధన రావు.. ఈ నటుడు సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు చాలా మంది హీరోలతో కలిసి కొన్ని వందల సినిమాల్లో నటించారు. ఇదే కాకుండా జూనియర్ ఎన్టీఆర్‌‌తో, జనతా గ్యారేజ్ సినిమాలో కీలకమైన సన్నివేశంలో కూడా నటించారు..

 

 

దాదాపు 40 ఏళ్లుగా ఇండస్ట్రీలోనే ఉన్న ఈయన మార్చ్ 6 వ తేదీన ఉదయం చెన్నైలోని ఆయన నివాసంలో అనారోగ్యంతో కన్నుమూశారు.. ఇక ఈయన సినిమాలతో పాటు సౌత్ ఇండియన్ ఫిల్మ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌లో జాయింట్‌ సెక్రటరీగా, కమిటీ సభ్యుడిగా కూడా వ్యవహరించారు..

 

 

జనార్ధన్‌రావు స్వస్థలం గుంటూరు జిల్లాలోని పొనిగళ్ల గ్రామం.. కాగా జనార్ధన్‌ రావుకు మంచి పేరు తెచ్చిన చిత్రాల్లో.. నాగార్జునతో నటించిన జానకి రాముడు, మజ్ను.. మోహన్ బాబు పెదరాయుడు, ఎన్టీఆర్ కొండవీటి సింహం, చిరంజీవి అభిలాష, కోడి రామకృష్ణ అమ్మోరు, శోభన్ బాబు గోరింటాకు లాంటి మొదలగు సినిమాలను చెప్పవచ్చూ..

 

 

ఇక ఈ చిత్రాల్లో వివిధ పాత్రల్లో కనిపించిన జనార్దన రావు తనదైనా నటనతో ప్రేక్షకుల్ని అలరించారు... సినిమాలే కాకుండా గోకులంలో సీత, తలంబ్రాలు వంటి టీవీ సిరీయల్స్‌లో కూడా నటించి, మెప్పించారు...

 

 

ఇకపోతే ఈయన మరణంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకోగా, ఆయన మృతి పట్ల పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.. 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: