మహిళా దినోత్సవం రోజు ముద్దుగుమ్మలతో సహా మనోజ్ సూపర్ విషెస్..!
ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్న ప్రతిఒక్కరూ తమ ఆడపడుచులని దేవతలుగా పూజిస్తున్నారు. తమ ఆడవారు చేస్తున్న పనులను గుర్తుచేసుకొని మరీ వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉమెన్స్ డే లాగానే ప్రతిరోజూ ఆడవాళ్ళకి ఇంపార్టెన్స్, గౌరవం ఇస్తే చాలా బాగుంటుందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సెలబ్రిటీస్ కూడా తమదైన శైలిలో ఉమెన్స్ డే విషెస్ చెబుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసి అందరిని ఆలోచించేలా చేస్తున్నారు. వారిలో ముఖ్యంగా మంచు మనోజ్, ఇంకా తదితర నటీమణులు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
Every single day is a women's day if we understand the importance of women🙏 Respecting and protecting them are our responsibilities 😍
Happy #WomensDay to all the wonderful women❤#HappyWomensDay2020 #HappyWomensDay pic.twitter.com/p8Nx4lMIej — MM*🙏🏻❤ (@HeroManoj1) March 8, 2020
ఇకపోతే ఈరోజు మంచు మనోజ్ ఉమెన్స్ డే ని పురస్కరించుకొని తన ట్విట్టర్ ఖాతాలో... "మనం మహిళల యొక్క ప్రాధాన్యత తెలుసుకుంటే ప్రతిరోజూ ఉమెన్స్ డే నే అవుతుంది. మన ఆడవాళ్ళకి గౌరవం ఇచ్చి వారిని కంటికి రెప్పలా కాపాడటం మన బాధ్యత. అందరికి హ్యాపీ ఉమెన్స్ డే' అని తన ట్వీట్ లో పేర్కొన్నాడు.
I was raised by an extraordinary woman who taught me to get up every time I failed.
Wishing all you amazing women a very Happy Women's Day! May we lift each other up, conquer everything that holds us from reaching our highest potential! ❤#WomensDay #InternationalWomenDay2020 — kajal aggarwal (@MsKajalAggarwal) March 8, 2020
కాజల్ అగర్వాల్ కూడా ఉమెన్స్ డే విషెస్ చెబుతూ... 'నేను ఒక అద్భుతమైన మహిళ చేత పెంచబడ్డాను. నేను విఫలమైన ప్రతిసారి ఆమె నన్ను ప్రోత్సాహించి ఎలా విజయం సాధించాలో నేర్పించింది. అమేజింగ్ మహిళరందరికి హ్యాపీ ఉమెన్స్ డే. ఒకరికొకరు సాయం చేసుకుంటూ మనం పూర్తి సామర్ధ్యం చాటుదాం', అని తన ట్వీట్ లో పేర్కొంది.
లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా ఉమెన్స్ డే విషెస్ ని ట్విట్టర్ వేదికగా తెలిపింది. 'నన్ను అమ్మాయి గా పుట్టించిన ఆ దేవుడికి నేను కృతజ్ఞతురాలిని. మహిళల సామర్థ్యాన్ని సంతోషంగా జరుపుకున్నాం', అంటూ తన ట్విట్టర్లో ఆమె పేర్కొంది.
పరిణితి చోప్రా కూడా విషెస్ చెప్తూ మన ఆడ పిల్లలను చదివించి వారిని అన్ని రంగాల్లో రాణించేలా కృషి చేద్దాం అంటూ తన ట్విట్టర్లో పేర్కొంది. మంచు లక్ష్మి కూడా ఉమెన్స్ డే విషెస్ నేమ్ తెలియజేస్తూ మెత్తని ఒక్కరిదే కాదు సంవత్సరం పొడుగూతా జరుపుకోవాలి. ఈరోజు అక్కాచెల్లెళ్లకు, తల్లి కి ఎప్పుడు సపోర్టు ఇస్తామని ప్రార్థన చేయాలి' అంటూ ఆమె పేర్కొంది.