నమ్మలేని నిజం రికార్డ్ క్రియేట్ చేసిన సిద్దార్ద్ !

Seetha Sailaja
అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలు పెట్టి తరువాత హీరోగా ఎదిగి టాలీవుడ్ లో కోలీవుడ్ లోన కాకుండా బాలీవుడ్ లో కూడా తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న హీరో సిద్దార్ద్ వ్యక్తిగత జీవితం ఎలా ఉన్నా నటుడిగా మాత్రం మంచి పేరు మన దక్షిణాది సినిమా రంగంలో ఉంది. కొన్నాళ్ళ క్రితం కాలేజీ అమ్మాయిలకు డ్రీమ్ బాయ్ గా ఒక వెలుగు వెలిగిన సిద్దూ ప్రస్తుతం తన ప్రాభవాన్ని కోల్పోయి క్యూట్ హీరోయిన్ సమంతకు లవర్ బాయ్ గా మారిపోయాడు.  అటువంటి సిద్ధార్థ్ తెలుగులో సినిమాలే చేయ‌డం లేదు,కానీ రికార్డులు సాధిస్తూనే ఉన్నాడు. సినిమాలు లేని సిద్దూకు రికార్డులు ఏమిటీ అనుకుంటే మాత్రం మీరు ఈ వార్త చదవవలసిందే. సిద్ధార్థ్ సాధించిన రికార్డు సినిమాలకి సంబంధించిన‌దేమీ కాదు. ఆయ‌న ట్విట్టర్‌లో రికార్డు అదర కొట్టాడు. ఇంత‌కీ ఆ రికార్డేమిటి? ఎలా అంటే? సమంత బాయ్ ఫ్రెండ్ ట్విట్టర్‌ ను ప‌దిల‌క్షల మంది ఫాలో అవుతున్నారట. ఇటీవ‌లే ఆ మార్క్‌ని దాటాడు సిద్దార్డ్. సౌత్‌లో ఓ న‌టుడిని ఇంత‌మంది ఫాలో అవ్వడం ఇదే తొలిసారట‌. అందుకే సిద్ధార్థ్ ఖుషీ ఖుషీగా ఉన్నాడు అని అంటున్నారు.  సిద్దూ త‌న ఆనందాన్ని తన ట్విట్టర్‌ద్వారా పంచుకొన్నాడు. సిద్ధార్థ్‌కి దుఃఖ‌మొచ్చినా, ఆనంద‌మొచ్చినా ట్విట్టర్‌తోనే పంచుకొంటుంటాడు. చివ‌రికి ప్రియురాలు స‌మంత‌కి ఏదైనా సందేశం పంపాల‌న్నా కూడా ట్విట్టర్ ద్వారానే. తన భావాలు తన ప్రేమ తన ఆవేశం ఈ అంశాల వ్యక్తీ కరణకు ట్విటర్ ను సిద్దార్డ్ ఉపయోగించు కున్నంతగా మరే హీరో ఉపయోగించు కోడంటే అతిశయోక్తి కాదు. అందుకే టాలీవుడ్ కోలీవుడ్ లను ఒక కుదుపు కుదిపేస్తున్న మాయలేడి సమంత మనసు దోచుకున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: