హోలీ సందర్భంగా అభిమానులకు హాట్ బ్యూటీ సందేశం
ఈ సందర్భంగా అభిమానులను కెమికల్ బేస్డ్ కలర్స్ వాడవద్దని కోరింది పవిత్ర. `నాకు తెలిసినంత వరకు హోలీ అనేది సన్నిహితులు కుటుంబ సభ్యులు కలిసి చేసుకునే పండుగ. సందర్భంగా ఏడాది అంతా గుర్తుండిపోయే జ్ఞాపకాలు సంపాదించుకోవాలి. ప్రతీ ఏడాదిలాగే ఈ ఏడాది కూడా నేను హోలీ ఆడేందుకు ప్లాన్ చేసుకున్నా.. కానీ నాకు నీటిని వృథా చేయటం ఇష్టం ఉండదు. అందుకే నేను సహజ సిద్ధమైన గులాల్ను మాత్రమే వాడతాను. తరువాత రుచికరమైన వంటకాలను సన్నిహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆరగించి ఎంజాయ్ చేస్తాను` అంటూ కామెంట్ చేసింది. `నా అభిమానులను కూడా నేను ఇదే కోరుతున్నాను. అందరూ సహజసిద్దమైన రంగులతో ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి. ప్రమాదకరమైన రసాయనాలతో తయారు చేసిన రంగులు వినియోగించటం మానేయండి. అదే సమయంలో నీటిని కూడా వృథా చేయటం మానండి` సోషల్ మీడియా వేదిక అభిమానులను కోరింది పవిత్ర పునియా. ప్రస్తుతం పవిత్ర సోని సాబ్‌లో ప్రసారం అవుతున్న బాల్వీర్ రిటర్న్స్‌లో కీలక పాత్రలో నటిస్తోంది.