నవ్వు.. నవ్వించు.. నవ్వుల్నీ నలుగురికి పంచు అనే ఇద్దరు "రాజీబాబు -రమాప్రభ "
పాతకాలంలో నటి నటీమణులలో చెప్పుకోదగ్గ హిట్ కాంబినేషన్ మన రమాప్రభ - రాజీబాబులదే. నలుపు తెలుపు చిత్రాల నుంచీ కాలానుగుణ మార్పుల్ని స్వాగతిస్తూ ముందుకు సాగుతున్న తెలుగు సినిమాతో పెరిగి పెద్దయిన నటులు రమాప్రభ, రాజీబాబు. నవ్వు...నవ్వించు...నవ్వులు నలుగురికి పంచు...అనే సిద్ధాంతాన్నే జీవితంగా మలచుకున్న హాస్య నటులు ఇద్దరు.
ఎవరికి తగ్గా నటనతో వాళ్ళు హాస్యాన్ని పండించేవారు. వీళ్ళు ఇద్దరి జంట ప్రేక్షకులకు కన్నుల పండగగా ఉంటుంది. రమాప్రభ, రాజబాబుది అద్భుతమైన సినీ కెమిస్ట్రీ. వీళ్లిద్దరూ కలిసి రెండు, మూడు వందలకు పైగా సినిమాలలో నటించారు. రాజబాబుతో ఎంతో ఆత్మీయబంధం ఉంది రమాప్రభకు. ‘ఒరేయ్’ అని రాజబాబుని పిలిచేవారు రమాప్రభ. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా పాత్రలు చేయడం వలనే ఇంత కాలం ఇండస్ట్రీలో కంటిన్యూ అవగలుగుతున్నానని కూడా రమాప్రభ అంటుంటారు.
తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన గొప్ప నటీమణుల్లో ఒకరు రమాప్రభ. సినిమాల్లోకి రాకముందు రమాప్రభ నాటకాలలో నటించారు. నటన అంటే రమాప్రభకు ఎంతో ఇష్టం. ఎంత పెద్ద డైలాగు చెప్పినా రమాప్రభ ఎంతో సులభంగా చెప్పేవారు. రమాప్రభ షూటింగ్ టైంలో తోటి నటీనటులతో సరదాగా ఉండేవారు. సరదాగా, జాలీగా అందరితో స్నేహపూర్వకంగా మాట్లాడడం రమాప్రభకు అలవాటు.
అలాగే రాజీబాబు కూడా పాతకాలంలో ఉన్న హీరోలందరితో నటించారు. రాజీబాబు నవ్వుకే ఫిదా అవుతారు అందరు. ముఖంలో పండించే హాస్య భావాలు చూస్తే చాలు అందరికి నవ్వు వచేస్తుంది. వీళ్ళ ఇద్దరి పాత కాలంలో చెప్పుకోదగ్గ జంట. మంచివాడు, బొమ్మరిల్లు, ఇల్లు ఇల్లాలు, జీవన జ్యోతి ఇలా కొన్ని సినిమాల్లో నటించి హాస్యాన్ని పండించారు. ఇప్పటికి, ఎప్పటికి వీరిరువురు కాంబినేషన్ సుపర్ డూపర్ హిట్.