సినిమాలో ఉన్నట్లుగానే.. మనం కూడా ఓ సారీ ట్రై చేద్దామా...!

praveen

అప్పట్లో జె.డి.చక్రవర్తి అంటే ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో ఏళ్ల పాటు వివిధ సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను  సంపాదించుకున్నారు జె.డి.చక్రవర్తి. ఎన్నో విజయాలను కూడా అందుకున్నారు. ఇక ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో ఎన్నో సినిమాల్లో  వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించారు. ఇక ఆ తర్వాత తెర మీద ఎక్కడా కనిపించలేదు జె.డి.చక్రవర్తి. ఇక ఇప్పుడు చాలా రోజుల తర్వాత ప్రముఖ నటుడు జె.డి.చక్రవర్తి ప్రధాన పాత్రలో ఎన్  ఎస్ సి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఎంఎం ఓఎఫ్. ఆర్ఆర్ఆర్  ప్రొడక్షన్స్, జేకే  క్రియేషన్స్ బ్యానర్ పై రాజశేఖర్, జేడీ ఖాసీం లు  ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

 


 ఇక ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు జె.డి.చక్రవర్తి, సీనియర్ నటుడు బెనర్జీ, అక్షిత, మనోజ్ నందన్,  చమ్మక్ చంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్  కూడా అభిమానులను ఎంతగానో అలరించిన విషయం తెలిసిందే.ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను సెన్సేషనల్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా విడుదల చేసింది చిత్ర బృందం. కాగా ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. థియేటర్ లో జరిగే సంఘటనలను ప్రధానంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించినట్లు గా తెలుస్తోంది... అంతేకాదు సినిమా చూస్తున్న సమయంలో... సినిమాలో  లిప్ టు లిప్ కిస్ సీన్ చూసావా అది మనం కూడా ట్రై చేద్దామా అంటూ హీరోయిన్ పలికే డైలాగ్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. 

 


 ఇక ఈ సినిమా టైలర్ మొత్తం అందరినీ ఆకర్షిస్తూ ఆసక్తికరంగా మారింది. రెండు నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్.... పూర్తిగా పూర్తిగా ఉత్కంఠ  భరితంగా ఉంది. కాగా ఈ చిత్రానికి సాయికార్తీక్ స్వరాలను అందిస్తున్నారు. అయితే చాలా రోజుల తర్వాత నటుడు  జెడి చక్రవర్తి ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతుండడంతో అటు  ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమాతో  జెడి చక్రవర్తి కెరియర్  ఎలాంటి మలుపులు తిరుగుతుందో.

" height='150' width='250' src="https://www.youtube.com/embed/pNUPtN6JPik" width="560" height="315" data-framedata-border="0" allowfullscreen="allowfullscreen">

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: