ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా.. ఎందుకో మీరే చూడండి
జూనియర్ ఎన్టీఆర్.. ఆ పేరులోనే ఒక పవర్.. ఒక మ్యాజిక్ ఉంటుంది. ఫుల్ పాపులారిటీ సంపాదించుకొని మాస్ హీరోగా ముద్ర వేసుకున్నారు. ఎన్టీఆర్ కి అసలు మామూలు క్రేజ్ లేదు. ఏంటి ఇంతగనంగా పొగుడుతున్నారు అనుకుంటున్నారా..?? ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీకు తెలిస్తే.. అవును అనటంలో అతిశయోక్తి లేదు. ఇంతకీ ఆ విషయం ఏంటంటే.. ఆస్ట్రేలియాలో రీసెంట్ గా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో మహిళల టి20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. అయితే.. ఆ మ్యాచ్ లో ఇండియా, ఆస్ట్రేలియా జట్లు ఒకరినొకరితో తలపడ్డాయి. కాగా., ఈ మ్యాచ్ లో ఇండియాని ఓడించి ఆస్ట్రేలియా కప్పు గెలుచుకుంది.
అవును దీంట్లో ఏముంది అని అనుకుంటున్నారా..?? ఇక్కడే మరి ఆసక్తికర విషయం జరిగింది. ఆ విషయం ఏంటంటే.. ఫైనల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు స్టేడియంలో ఎన్టీఆర్ సినిమాలోని ఓ పాటను ప్లే చేసారు. ఆ పాట ఇంకేదో కాదు.. పక్కా లోకల్ పక్కా లోకల్ సాంగ్. ఇది ఎన్టీఆర్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘జనతా గ్యారేజ్’ సినిమాలోది. ఈ సాంగ్ లో ఎన్టీఆర్, కాజల్ కలిసి కుమ్మేసిన పక్కా లోకల్ సాంగ్ అక్కడ మార్మోగింది.
Video - 2#JaiBalayya Slogans..❤️#NTR's #PakkaLocal song in #Melbourne_Cricket_Stadium, Australia... 🔥🏏#T20WorldCup#JaiBalayya Slogans#JrNTR masss. @tarak9999#DarlingKajal❤️.. @MsKajalAggarwal#DSP sir😎 @ThisIsDSP https://t.co/t1eQ5DvOJ5 — BhArGaV RaM{BR} (@BhargavRam_NTR) March 8, 2020
అయితే.. ఈ పాట అక్కడ చాలా మందికి ఉత్సాహం నింపిందట. ఆ మ్యాచ్ ను చూస్తున్న ఒక ప్రేక్షకుడు ఆ పాట రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఇంకేముంది.. అటు పోయి, ఇటుపోయి ‘జనతా గ్యారేజ్’ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఆ వీడియోను చూశారు. చూసి దానికి లైక్ కొట్టారు.. ఇక ఇప్పుడు ఆ పోస్ట్ వైరల్ గా మారింది.
ఆ వీడియో చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఎన్టీఆర్ రేంజ్ అంటే ఇదీ అంటూ తెగ మురిసిపోతున్నారు. మెల్బోర్న్ లో కూడా ఎన్టీఆర్కి ఇంత ఫాలోయింగ్ ఉందని సంబరపడుతున్నారు అభిమానులు. కాగా., ఎన్టీఆర్ ఇప్పుడు ‘RRR’ సినిమాలో కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. ఈ విషయం గురించి అందరికీ తెలిసిందే.. ఇప్పుడే ఇంత క్రేజ్ తెచ్చుకున్న ఈ హీరో.. rrr తరువాత తారక్ కెరీర్ గ్రాఫ్ తారాస్థాయికి చేరుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు. అసలే పులితో ఫైట్ అంటూ ఇక ఆ సీన్ తారక్ ను ఒక రేంజ్ కి తీసుకెళ్తుంది అని అభిమానులు అంటున్నారు.